Headlines News :

మజ్ను సినిమా రివ్యూ


రివ్యూ: మజ్ను
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కెవా మూవీస్‌
తారాగణం: నాని, అను ఎమాన్యుయెల్‌, ప్రియ శ్రీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, సత్య, పోసాని కృష్ణమురళి, రాజ్‌ తరుణ్‌ (ప్రత్యేక పాత్రలో) తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కూర్పు: ప్రవీణ్‌ పుడి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
నిర్మాతలు: పి. కిరణ్‌, గీత గోళ్ల
కథ, కథనం, దర్శకత్వం: విరించి వర్మ
విడుదల తేదీ: సెప్టెంబరు 23, 2016

బన్నీ కొత్త సినిమాలో ఆమేనా?

బన్నీ కొత్త సినిమాలో ఆమేనా?
క్యాన్సిల్ అనుకున్న కాంబినేషన్ వర్కవుట్ అయిపోయింది. అల్లు అర్జున్-లింగుస్వామి కాంబినేషన్లో ద్విభాషా చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ముందు హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టి.. సగం పూర్తి చేశాక లింగుస్వామి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నాడు బన్నీ. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలవుతుంది. సూర్య కజిన్ జ్నానవేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషలు రెండింట్లోనూ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటిదాకా బన్నీ, లింగుస్వామి, జ్నానవేల్ రాజా మినహాయిస్తే ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకే పేర్లూ కన్ఫమ్ కాలేదు.

మిగతా వాళ్ల మాటెలా ఉన్నా ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న దాని మీదే అందరి ఆసక్తి నిలిచి ఉంది. ఈ మధ్య తెలుగు హీరోలందరికీ హీరోయిన్ల సమస్య ఎదురవుతోంది. ఆ అమ్మాయి.. ఈ అమ్మాయి అంటూ చాలామందిని ట్రై చేసి.. చివరికి ఎవరో ఒకరికి ఫిక్సవుతున్నారు. బన్నీ-హరీష్ సినిమాకు కూడా రకరకాల పేర్లు పరిశీలించి చివరికి పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు. ఇక బన్నీ కొత్త సినిమా విషయంలో ముందుగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. ‘నేను శైలజ’తో మంచి విజయాన్నందుకున్న కీర్తి.. ఆ తర్వాత నాని పక్కన ‘పక్కా లోకల్’ చేస్తోంది. వేరే స్టార్ హీరోల పక్కన ఆమెకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. ఐతే బన్నీ పక్కన ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేస్తే అటు తమిళ వెర్షన్‌కు కూడా బాగా కలిసొస్తుంది. డేట్లు అవీ చూసుకుని దాదాపుగా ఆమెనే ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి.


telugu.gulte.com

కుర్రకారు హీరో రామ్ ఎందుకిలా చేస్తున్నాడు !

కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు ఫేస్ చేసి ఈ ఏడాది సక్సెస్ ట్రాక్ ఎక్కిన కుర్ర హీరో రామ్‌కు ఫ్లాప్ డైరెక్టర్సే సెంటిమెంట్‌గా మారిపోయారట. యంగ్‌స్టార్ నయా మూవీ కూడా హిట్టయితే... ఇక మనోడు ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం ఉందంటున్నారు సినీ జనం. సక్సెస్ కోసం ఎదురుచూసే హీరోలెవరైనా సక్సెస్ కొట్టి మంచి స్వింగ్‌లో ఉన్న దర్శకుడితో సినిమా చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. వరుస హిట్స్‌తో టాప్ రేంజ్‌కు వెళ్లిపోవాలనుకునే హీరోలందరి ఫీలింగ్ దాదాపుగా ఇలాగే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ యంగ్ హీరో రామ్ మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతుండటం ఆసక్తిగా మారింది. అంతకుముందు కోలీవుడ్‌లో ఒక ఫ్లాప్, టాలీవుడ్‌‌లో ఒక ఫెయిల్యూర్‌ను ఫేస్ చేసిన దర్శకుడు కిశోర్ తిరుమలతో 'నేను శైలజ' సినిమా చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు రామ్.

ఈ మూవీ తరువాత 'సుప్రీమ్' దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు డైరెక్షన్‌లో చేయాల్సి ఉందట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ కావడంతో తనకు 'కందిరీగ' వంటి హిట్ ఇచ్చి, ప్రస్తుతం ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'హైపర్' అనే మూవీలో యాక్ట్ చేశాడు రామ్. ఈ సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్న రామ్ తన నెక్ట్స్ మూవీ కోసం కూడా ఫ్లాప్ డైరెక్టర్‌కే ఛాన్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఫ్లాప్స్‌లో ఉన్న దర్శకుడు కరుణాకరన్‌తో సినిమా చేయాలని రామ్ డిసైడవ్వడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గతంలో తనకు 'ఎందుకంటే ప్రేమంట' వంటి ఫ్లాప్ ఇచ్చిన కరుణాకరన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న రామ్... అతడితో 'క్రేజీ ఫీలింగ్' అనే మూవీని ఫిక్స్ చేసుకోవడంపై ఇండస్ట్రీ వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి. మొత్తానికి 'హైపర్' కూడా హిట్టయితే ఇక ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమాలు చేయడం రామ్‌కు సెంటిమెంట్‌గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదమో.
andhrajyothy.com

ప్రత్యేక హోదాపై జగన్‌ మెుసలి కన్నీరు కారుస్తున్నారు

ప్రత్యేక హోదాపై జగన్ యువభేరీ పేరుతో సమావేశం ఎందుకు పెట్టారో ఆయనకే అర్థం కాని పరిస్థితి అని టీడీపీ ఏపీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ద్వజమెత్తారు. శుక్రవారం గుంటూరు ఎన్టీ ఆర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృ ద్దిని అడ్డుకోవడం తప్ప జగన్‌కు రాష్ట్రాభివృద్ది పట్ల చిత్తశుద్ది తేదన్నారు. సాదారణ రాజకీయ నాయకులైతే రాష్ట్రాభివృద్ది, దేశాభివృద్ది గురించి ఆలోచి స్తారు.క్రిమినల్ మైండ్ సేట్ ఉండేవాళ్లు తప్పుడు మార్గాల ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు ఆయన చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఎక్కడైనా ఉందా జగన్ ఏనాడైనా పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా విభజన సమయంలో సోనియాగాంధీ,కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని పార్లమెంట్‌లో మౌనం వహించారు. ఇపుడు విద్యార్థులు,యువకులను తప్పుదోవ పట్టిం చేందుకు సభలు పెడుతున్నారు. 

జగన్ ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎకు ్కతారు. రెండు గంటల కితం రాంకీ కేసు విషయంలో కూడా కోర్టు కు వెళ్లి వచ్చారు. ఆయనతో పాటు రాంకీకి చెందిన జానికిరామ్, విజయసాయిరెడ్డి, మరో ఐఏఎస్ ఉన్నారు. కోర్టు మెట్లు ఎక్కుతు 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్‌కు చంద్రబాబును విమర్శించే అర్హత ఉందో లేదో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబుపై 26 ఎంక్వైరీలు వేసినప్పటికీ ఆయన నిప్పులా బయటపడారు.చంద్రబాబు ప్రజలకోసం భయపడతారు తప్పితే మరెవరికి కాదు నీలాంటి చిన్న చిన్న వ్యక్తులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి పంపారు. 23 సార్లు వెళ్లి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందన్నారు.

 ఇందులో పోలవరానికి 100 శాతం నిధులు ఇస్తామని చెప్పిందన్నారు. పోలవరానికి రూ32 వేల కోట్లు వస్తాయి ,వచ్చే రెండేళ్లలో పోలరం పూర్తికావాలంటే ఈ నిధులు తీసుకోవద్దా తీసుకోకపోతే రెండేళ్లలో పోలవరం ఏవిధంగా పూర్తివుతుందన్నారు. ఇచ్చినవి తీసుకుంటూనే రావల్సిన వాటికోనం పోరాడాఅన్నారు.ఇప్పటికే అనుక విద్యాసంస్తలు వచ్చాయి. శ్రీకాకుళానికి ట్రిపుల్ ఐటీ వస్తే బిల్డింగ్ లేని పరిస్థితి, క్లాసులను నూజివీడులో పెడతున్నారు. వీటి బిల్డింగ్‌లను జగన తాత కడతారా కమర్షియల్ కారిడార్స్‌కు రూ30వేలకోట్లు, రెవిన్యూలోటురూ10వేలకోట్లు, విదేశీ రుణాల ద్వారా రూ30 వేల కోట్లు, రాజధానికి రూ10వేలకోట్లు వస్తాయి. వీటి ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు
suryaa.com

నిజమా… ‘ముఖ్యమంత్రి’గా మహేష్ బాబు?

mahesh-babu-as-chief-minister-roleటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇవ్వబోతున్నారా? ప్రస్తుతం సోషల్ మరియు వెబ్ మీడియా సమాచారం మేరకు అయితే ‘అవును’ అన్న సమాధానమే లభిస్తోంది. నిజజీవితంలో రాజకీయాలంటేనే దూరంగా ఉండే మహేష్ బాబు, రీల్ లైఫ్ లో ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోన్న వార్త ట్రేడ్ వర్గాలను షేక్ చేస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ ‘సిఎం’గా నటించబోతున్నారని, ఈ సినిమాను ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా కొరటాల మలిచారని హల్చల్ చేస్తున్న ఈ వార్తలో నిజం ఎంతుందనేది కొరటాల, మహేష్ లకే తెలియాలి. రాజకీయ అంశాలతో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో, కొరటాల మార్క్ బ్యాక్ గ్రౌండ్ సోషల్ మెస్సేజ్ తో ఈ సినిమా సిద్ధమవుతోందని టాక్. అయితే దీనిపై స్పష్టమైన సమాచారం వచ్చే వరకు ప్రిన్స్ ఫ్యాన్స్ కు నిద్ర ఉండదని చెప్పడంలో సందేహం లేదు.
‘దూకుడు’ సినిమాలో ఎమ్మెల్యేగా నాటకం ఆడిన మహేష్ లుక్ కు అభిమానులు ఏ విధంగా పట్టం కట్టారో తెలిసిందే. మరి అలాంటిది ఏకంగా ఒక ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ నిజంగా కనపడితే… సిల్వర్ స్క్రీన్ ఏమైపోవాలి? అందులోనూ సిఎం పాత్రలో ఇప్పటితరం నటులే కాదు, చిరంజీవి తరం హీరోలలో ఒక్కరు కూడా నటించలేదు. దీంతో ఈ సమాచారంపై అసలు వాస్తవాలు ఏంటని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. చూడాలి… చివరికి ఎలాంటి సమాధానం బయటకు వస్తుందో..?!mirchi9.com

‘బాత్ టబ్‌’తో కుర్రకారుకు పూనం అన్ లిమిటెడ్ మజా.!

ఎప్పుడు మూడొస్తే అప్పుడు వలువలు విసిరి పారేస్తూ కుర్రకారుకు కావాల్సినంత మజా ఇస్తోంది బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే. నషా మూవీతో ఆడియన్స్‌కు అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ సెక్సీ మోడల్ ప్రస్తుతం వీకెండ్ బాత్‌ అనే ఎరోటిక్ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ కోసం అప్పుడే హాట్ ప్రమోషన్‌లు షురూ చేసి కుర్రకారకు పిచ్చెక్కిస్తోంది. కొంచెం మసాలా టచ్ ఉన్న సినిమాలకే ఓ రేంజ్‌లో ప్రమోటింగ్ చేసే పూనం ఎరోటిక్ మూవీ వీకెండ్ బాత్‌ కోసం అంతకు మించి అంటూ రెచ్చిపోతోంది. వీకెండ్ మజా ఎలా ఉంటుందో విడుదలకు ముందే జనాలకు రుచి చూపిస్తోంది.

నయూ మూవీ ప్రమోషన్ కోసం బాత్‌ టబ్‌లో షూటింగ్ అంటూ స్పైసీ.. స్పైసీ ఫొటో షూట్ ఒకటి తీయించుకుని నెట్‌లో రిలీజ్ చేసింది పూనమ్. గతంలోనే బాత్రూమ్ ప్రైవేట్ పిక్స్ ఆడియన్స్‌‌‌తో షేర్ చేసుకున్న ఈ సెక్సీ మోడల్ ఇప్పుడు కూడా ఆ రేంజ్‌లోనే హాట్ షో చేసి ఆడియన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సెక్స్ బాంబ్ బాత్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీకెండ్ బాత్ ఎంత స్పైసీగా ఉంటుందో చెప్పకనే చెబుతున్న పూనమ్ సినిమాలో అన్ లిమిటెడ్ మజా ఇస్తుందో చూడాలి.!హైదరాబాద్ కు చెడ్డ పేరు తేవొద్దని కేసీఆర్ విజ్ఞప్తి

భారీ వర్షాలతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. జనాలు ఇళ్లలోనుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అపసోపాలు పడుతున్నా చాలా ఏరియాల్లో నీరు ఇంకా ఇళ్లలోనే ఉంటోంది. హైదరాబాద్ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని అటు మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా తెగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కేసీఆర్ హైదరాబాద్ కు ఏకంగా సముద్రమే తెచ్చారని కొందరు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు.

  హైదరాబాద్ వరదలపై మీడియాలో హోరెత్తుతున్న ప్రచారం టీఆర్ ఎస్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. హైదరాబాద్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ? అని ప్రపంచదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు సైతం షాక్ అవుతున్నారు. అయితే ఈ నష్ట నివారణ చర్యలకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి మరీ అంత భయంకరంగా లేదని... మీడియాలో దీన్ని ఓవర్ గా చూపించి హైదరాబాద్ నగరానికి చెడ్డ పేరు తీసుకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 హైదరాబాద్ లో కురిసిన ఈ భారీ వర్షాలకు ఒక్క మనిషి కాదు కదా ఒక్క జంతువు కూడా చనిపోలేదని ఆయన అన్నారు. నగరంలో అక్రమ కట్టడాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న కేసీఆర్ మూసి నది నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలను గుర్తించామని..వీటన్నింటిని నిర్దాక్షిణ్యంగా కూలగొడతామని కూడా ఆయన చెప్పారు. ఈ కట్టడాల్లో ప్రభుత్వ భవనాలు ఉన్నాయని వాటిని కూడా కూల్చుతామన్నారు. ఇక నగరంలో వరదల దృష్ట్యా 400 పాత భవంతులను ముందుగానే కూల్చడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు.

  ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం కురిసిన వర్షం ఈ శతాబ్దంలోనే అత్యధికమని కూడా ఆయన తెలిపారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ లో సగటు సాధారణ వర్షపాతం 84 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా ఈ యేడాది అది 468 మిల్లీమీటర్లు అయ్యిందన్నారు. ఇక నగరంలోని వరద పరిస్థితి గురించి కేంద్రానికి వివరించి కేంద్రం సాయాన్ని కోరతామని చెప్పారు.

కేసీఆర్ విజ్ఞప్తి - మేయర్ వార్నింగ్ :

ఇక హైదరాబాద్ వర్షాలను భయంకరంగా చూపించవద్దని సీఎం కేసీఆర్ మీడియాకు విజ్ఞప్తి చేస్తే...నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ వరద పరిస్థితిపై సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టేవారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. హుస్సేన్ సాగర్ కు ప్రమాదం ఉందని కాప్రా చెరువు  తెగుతుందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు
tupaki.com

స్టేలతో కాలం గడుపుతున్న బాబు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేలతో కాలం గడుపు తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో ఆయన స్టే తెచ్చున్నారని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులోనూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే 4 వారాల్లో తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారని చంద్ర బాబును ఆయన ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హాండెడ్‌గా దొరికిపోయారన్నారు. బ్లాక్‌మనీతో తెలం గాణ ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ ముమ్మాటికీ చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు. అది తన వాయిస్ కాదని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓటు కు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.suryaa.com

ప్లకార్డుతో రోడ్డెక్కిన సీఎం చంద్రబాబు.!

అవును సీఎం చంద్రబాబు ప్లకార్డు తీసుకుని రోడ్డెక్కారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ప.గో జిల్లా ఏలూరు జడ్పీ ఆఫీసు నుంచి ర్యాలీగా వచ్చారు. ఫైర్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిచారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే దోమలపై దండయాత్రకుగాను నోడల్‌ అధికారుల నియామకం పూర్తయింది. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఒక్కో జిల్లాకు ఒక్కో అధికారిని నియమించారు.andhrajyothy.com

మా మధ్య రిలేషన్ ఉన్న మాట నిజమే – సీక్రెట్ రివీల్!

‘కొత్త బంగారు లోకం’ సినిమాలో వరుణ్ సందేశ్ జోడిగా ‘ఎ…క్క…డా…’ అంటూ ఓ సౌండింగ్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్న శ్వేతాబసు ప్రసాద్ జీవితంలో, 2014వ సంవత్సరం ఎలాంటి మలుపులు తీసుకుందో అందరికీ తెలిసిందే. అయితే ‘గతం గత:’ అన్నట్లు ఆ జీవితంపై స్పందించేందుకు నిరాకరించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచిన తన డేటింగ్ విషయాలను బయటపెట్టింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనురాగ్ కశ్యప్ నిర్మాణ సంస్థలో పరిచయమైన రోహిత్ మిట్టల్ తో శ్వేతా కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో వివిధ సందర్భాలలో శ్వేతను ప్రశ్నించినప్పటికీ, ఈ విషయంపై స్పందించడానికి అయిష్టత వ్యక్తం చేసింది. కానీ, తాజాగా ఆ వార్తలను ధృవీకరిస్తూ… రోహిత్ తో తానూ డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. ‘మేము రిలేషన్ లో ఉన్న మాట వాస్తవం, పెళ్లి గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు గానీ, చాలా స్మూత్ గా అది జరిగిపోతుందని నమ్ముతున్నానని’ చెప్పుకొచ్చింది. సానుభూతి పరమైన ఆలోచనలు, అవకాశాలు తనకు అవసరం లేదని, ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి కేంద్రీకరించానని చెప్పిన శ్వేతాబాసు ప్రసాద్, ప్రస్తుతం ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ సినిమాతో పాటు, ఏక్తాకపూర్ రూపొందిస్తున్న ‘చంద్రనందిని’ సీరియల్ లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

mirchi9.com

అంబానీ గురించి వెంకయ్య సెన్సేషనల్ కామెంట్

అధికారంలో ఎవరున్నా అంబానీల గురించి నెగెటివ్ గా మాట్లాడ్డం అరుదు. కాంగ్రెస్ వాళ్లయినా.. బీజేపీ వాళ్లయినా అంబానీల గురించి మాట్లాడేటపుడు కొంచెం జాగ్రత్త వహిస్తారు. ఐతే బీజేపీ అగ్ర నేత.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం అంబానీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ.. అంబానీల గురించి నెగెటివ్ గా మాట్లాడారు.

అదానీ.. అంబానీల ఎదుగుదలకు తమ పార్టీకి ముడిపెడుతూ కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై వెంకయ్య స్పందించారు. అదానీ.. అంబానీలను కాంగ్రెస్ పార్టీనే తయారు చేసిందని అన్నారు. వారి హయాంలోనే వాళ్లిద్దరూ ఎదిగేలా చేశారని.. కానీ ఇప్పుడు తమ పార్టీకి వారికి లింక్ పెడుతూ ఎలా మాట్లాడతారని వెంకయ్య ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో మేడం నిర్ణయిస్తే ప్రధాని పాటించేవాడని.. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తే ప్రధాని పాటిస్తున్నాడని వెంకయ్య అన్నారు. బీజేపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను దేశానికి ఇచ్చి..  రెండో ప్రాధాన్యతను పార్టీకి.. చివరగా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి భిన్నమన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఒక దుష్టశక్తి అన్న వెంకయ్య.. ఆ పార్టీతో పాటు వామపక్షాలు కూడా అవినీతికి కొమ్ముకాశాయని ఆరోపించారు. ఉగ్రవాదం ఏ మతానికి సంబంధించింది కాదు. కొంతమంది మాత్రం ఉగ్రవాదానికి మతం రంగు పులిమేందుకు యత్నిస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు.
tupaki.com

దసరా, దీపావళికి 36 ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండగల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా 36 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో బుధవారం ప్రకటనలో తెలిపారు. నెంబర్ 07438 కాచీగూడ - టాటానగర్ ప్రత్యేక రైలు 26, అక్టోబర్ 3, 10, 17, 24, 31, నంబర్ 7, 14 తేదీల్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదగా సాయంత్రం ఆరు గంటల సమయంలో గుంటూరుకు చేరుకొని విజయవాడ, విశాఖపట్టణం, భువనేశ్వర్ మీదగా మరుసటి రోజు రాత్రి7.45 గంటలకు టాటానగర్‌కు చేరుకొంటుంది. నెంబర్ 07439 టాటానగర్ -కాచీగూడ ప్రత్యేక రైలు ఈ నెల 27, అక్టోబర్ 4, 11, 18, 25, నంబర్ 1, 8, 15 తేదీల్లో రాత్ర 10.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి గుంటూరు వచ్చి రెండో రోజున వేకువజామున 5 గంటలకు కాచీగూడ చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్, రెండు ఏసీ త్రీటైర్, ఏడు స్లీపర్‌క్లస్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్ కోచలుంటాయని సీపీఆర్‌వో తెలిపారు.

హైదరాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు
నెంబర్ 07071 హైదరాబాద్ - విశాఖపట్టణం ప్రత్యేక రైలు ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదగా వేకువజామున గుంటూరుకు వచ్చి విజయవాడ మీదగా మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు విశాఖపట్టణం చేరుకొంటుంది. నెంబర్ 07072 విశాఖపట్టణం - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక గుంటూరు వచ్చి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకొంటుంది. ఈ రైలులో ఏసీ టూటైర్, రెండు ఏసీ త్రీటైర్, పది స్లీపర్‌క్లాస్ కోచలుంటాయి.

సికింద్రాబాద్ - విశాఖపట్టణం - హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు
నెంబర్ 07069 సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రత్యేక రైలు ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21, 28(శుక్రవారం) తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయ లుదేరి పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదగా మరుసటి రోజు వేకువజామున గుంటూరుకు వచ్చి విజయవాడ మీదగా ఉద యం 10.25 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. నెంబర్ 07070 విశాఖపట్టణం - హైదరాబాద్ ప్రత్యేక రైలు అక్టోబర్ 1, 8, 15, 22, 29 తేదీ ల్లో(శనివారం) సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక గుంటూరు వచ్చి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్, 8.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలులో ఏసీ టూటైర్, రెండు ఏసీ త్రీటైర్, 10 స్లీపర్‌క్లాస్ కోచలుంటాయని సీపీఆర్‌వో తెలిపారు. గురువారం నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన సౌకర్యం ప్రారంభిస్తోన్నట్లు వెల్లడించారు.


suryaa.com

జగన్ తరఫున బాబుకు సవాల్ విసిరాడు

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీ అధికారపక్షం వదిలేసిన వైనం తెలిసిందే. హోదా గురించి కొంతకాలం హడావుడి చేసినా.. కేంద్రం సీన్లోకి వచ్చి అలాంటివి సాధ్యం కాదన్న విషయాన్ని బాబుకు అర్థమయ్యేలా చెప్పి.. తాము ఇచ్చింది తీసుకోవాలంటూ ప్యాకేజీ పేరిట కాస్తంత ముష్టి వేయటం తెలిసిందే. బాబుకున్న పరిమితుల పుణ్యమా అని మోడీ సర్కారు ఇచ్చిన ప్యాకేజీతో పొంగిపోయారు. కానీ.. ఆ విషయాన్ని ఒక్కసారిగా చెప్పేస్తే సీమాంధ్రుల్లో సెంటిమెంట్ దెబ్బ తినే అవకాశం ఉండటంతో కాస్త జాగ్రత్త వహించిన ఆయన.. హోదాఅంశాన్ని వదిలిపెట్టేది లేదంటూ ప్యాకేజీని స్వాగతించారు.

ప్యాకేజీని స్వాగతించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆ విషయాన్ని గుర్తించనట్లుగా ఉన్న చంద్రబాబు.. ప్యాకేజీ ప్రకటించిన రెండువారాల వ్యవధిలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని విజయవాడకు పిలిపించి మరీ పెద్ద ఎత్తున సన్మానం చేసేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య హోదా లేదు గీదా లేదని తేల్చేశారు.

ఇలాంటి వేళ.. ఏపీకి హోదా లేదా? అన్న సందేహం అందరి మదిలో మెదులుతున్న వేళ.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. తాజాగా యువభేరి నిర్వహించిన ఆయన.. బీజేపీ.. టీడీపీ పార్టీలపైనా ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. హోదా అంశంపై వారు ప్రదర్శించిన రెండు నాల్కుల ధోరణిని ఉదాహరణలో సహా వెల్లడించిన ఆయన.. సీమాంద్రులు ఎంత మోసానికి గురి అవుతున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఏలూరులో నిర్వహించిన యువభేరీకి వచ్చిన పాజిటివ్ స్పందన జగన్ బ్యాచ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకు తగ్గట్లే తాజాగా మాజీ మంత్రి పార్థసారధి ఒక సవాలు విసిరారు. హోదా విషయం మీద తమ అధినేత జగన్ తో ముఖాముఖి చర్చ జరిపేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమేనా? అని ప్రశ్నించారు.

తమ అధినేతతో ప్రత్యేక హోదా మీద ముఖాముఖి చర్చకు బాబు వస్తానంటే విజయవాడలో అయినా.. కుప్పంలో అయినా చర్చకు తాము సిద్ధమన్నారు. పార్థసారధి విసిరిన సవాలుపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఇద్దరు అధినేతలు.. ఒక వేదిక మీద కూర్చొని ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద తమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. మరి.. జగన్ బ్యాచ్ విసిరిన సవాలుకు చంద్రబాబు రియాక్షన్ ఏమిటో చూడాలి.


tupaki.com

గూగుల్ చేతికి ట్విట్టర్..!

సోషల్ మీడియాలో ట్విట్టర్ ఆవిర్బావం సరికొత్త విప్లవం. ట్విట్టర్ ఏర్పాటు తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో వచ్చినా ట్విట్టర్కు ఉన్న ఆదరణ మాత్రం చెక్కు చెదర్లేదు. ప్రపంచంలో చాలా మంది సెలబ్రిటీలు మిగిలిన సోషల్ మీడియాల కన్నా ట్విట్టర్ నే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి క్రేజ్ ఉన్న ట్విట్టర్ ప్రస్తుతం సేల్ లో ఉంది. ఇందుకు ఆ సంస్థకు వస్తోన్న నష్టాలే కారణంగా తెలుస్తోంది. 

 ట్విట్టర్ ను టేకోవర్ చేసేందుకు ప్రస్తుతం చాలా టెక్ కంపెనీలు సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ట్విట్టర్ అమ్మేస్తారని చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఇక గత కొంతకాలంగా ట్విట్టర్ వినియోగదారుల పెరుగుదల రేటు కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ను ఆశ్రయించే కమర్షియల్ యాడ్స్ తగ్గడంతో ఆ సంస్థ యాడ్స్ రేటు సైతం తగ్గించుకున్నట్టు తెలుస్తోది. దీంతో గత రెండు మూడేళ్లలో ట్విట్టర్ కు నష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది.

ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం ట్విట్టర్ ను టేకోవర్ చేసేందుకు గూగుల్ కూడా లైన్లోకి వచ్చినట్టు టాక్. దీని కోసం త్వరలోనే గూగుల్ నుంచి బిడ్ దాఖలయ్యే అవకాశం ఉందన్న టాక్ బిజినెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ట్విట్టర్ ను సేల్ కు పెట్టారని...గూగుల్ దీనిని టేకోవర్ చేస్తుందన్న వార్తలతో ట్విట్టర్ షేరు మార్కెట్లో ఒక్కసారిగా 19 శాతానికి పైగా పెరిగింది. 

 2013 తర్వాత ట్విట్టర్ షేర్లు ఇంత స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ పెరుగుదలతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం కూడా ట్విట్టర్-గూగుల్ కొన్ని అంశాల్లో కలిసి పనిచేస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ద్వారా ఏదైనా అంశాన్ని వెతికితే దానికి అనుబంధంగా ట్విట్టర్లో ఉన్న ట్వీట్లు సైతం సెర్చ్ రిజల్ట్ లో కనిపించేలా రెండు సంస్థల మధ్య ఒప్పందం ఉంది.
tupaki.com

ట్రంప్ గెలిస్తే అమెరికా వదిలిపోత

అమెరికా అద్యక్ష పోటిలో ఉన్న ట్రంప్ కు వ్యతిరేకత పెరుగుతున్నట్లు ఉన్నది.గతం లో అతనిపై పలు రకాల విమర్శలు,నిరసనలు తెలుపుతున్న విషయం ఉన్నదే.తాజాగా పులిట్జర్ అవార్డు గ్రహీత, చరిత్రకారుడు, రచయిత సాల్ ఫ్రీడ్‌లాండర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే తాను అమెరికా వదలివెళ్లిపోతానన్నారు. ట్రంప్ ఓ ప్రమాదకర పిచ్చోడన్నారు.
ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అందుకు కారణం హిల్లరీ వైఖరే కారణమన్నారు. హిల్లరీ కొన్ని విషయాల్లో వాస్తవాలు దాస్తున్నారన్నారు. ట్రంప్ విషయానికొస్తే..అతని ఆదాయ పన్ను వివరాల్ని వెల్లడించకపోయినప్పటికీ నిజాయితీ పరుడిగా ప్రజలకు కన్పిస్తున్నాడన్నారు
andhravilas.net/te

తమ ఎమ్మెల్యేల పై చర్యలకు ప్రభుత్వం కుట్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టి ఎమ్మెల్యే లపై చర్యలు త్తెసుకోవదని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆ పార్టి నేతలు ఆరోపిస్తున్నారు.అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ  జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి శుక్రవారమిక్కడ సమావేశమైంది. సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే పై 45 రోజుల్లో స్పీకర్ కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది. ఈ భేటీ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.
అందులో భాగంగానే యనమల తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందన్నారు. సభ్యులను సస్పెండ్ చేశాకే సభలోకి మార్షల్స్ రావాలని, అయితే మార్షల్స్ తోనే సభను నడపాలని ప్రభుత్వం యత్నించిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.ఇది ప్రభుత్వం కుట్రలో భాగమేనని అన్నారు.
andhravilas.net/te/

వైసీపీ చెత్త ప్రచారం వరదలో కొట్టుకుపోతుంది : దేవినేని ఉమా

టీడీపీ వస్తే వర్షాలు పడవు, నీళ్లు రావు అంటూ వైసీపీ చేసిన చెత్త ప్రచా రం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదలో కొటు ్టకుపో తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉ మ చెప్పారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ బ్యా రేజీకి వస్తున్న వరద పరిస్థితిని మంత్రి స్వయంగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థా యిలో నీళ్లు వస్తుండటంతో పట్టిసీమ నీటిని ఆపేసినట్లు ఆయన తెలిపారు. పులి చింతల ప్రాజెక్టులో 30టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లు మంత్రి చెప్పారు.

హరీష్ ఆరడుగుల బుల్లెట్

తెలంగాణ మంత్రి హరీష్ రావును నిజామాబాద్ ఎమ్.పి కవిత మెచ్చుకున్న తీరు బలేగా ఉన్నది.సినిమా డైలాగ్ వాడుతూ హరీష్ ను ఆమె పొగిడారు.హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్ అని ఆమె మెచ్చుకున్నారు.మార్కింటింగ్ శాఖలో విన్నూత్న పదకాలు చేపడుతున్న హరీష్ రావు రైతులకు అండగా ఉంటున్నారని, ఆయన ఆరడగుల బుల్లెట్ అని ఆమె అన్నారు.
జగిత్యాల మార్కెటింగ్ కమిటీ పాలక వర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు వెంటబడి నిదులు తెచ్చుకోవాలని వారికి సలహా ఇచ్చారు. మార్కెట్ కమిటీలు రైతులకు అండగా ఉండి, యార్డులను దేవాలయాలుగా మార్చాలని ఆమె అన్నారు. టిఆర్ఎస్ లో క్రమశిక్షణ తో పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని కవిత అన్నారు.
andhravilas.net/te/

రిలీజ్ డేట్స్ గోల

ఈ మధ్య పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం బాగా ఎక్కువైపోతోంది. బ్రహ్మోత్సవం ఎప్పుడు రిలీజవుతుందా అని రెండు మూడు నెలలగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. వాళ్లు ఎంత క్యూరియస్ గా ఉంటే.. యూనిట్ వర్గాలు అంతగా కన్ఫ్యూజ్ చేశాయి. ఎట్టకేలకు ఆడియో వేడుకలో మహేష్ మే 20 అంటూ డేట్ చెప్పేయడంతో హమ్మయ్య అనుకున్నారు. ఇప్పుడిక బ్రహ్మోత్సవం సంగతి తేలిపోయింది కాబట్టి.. మిగతా సినిమాలు డేట్లు సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. బ్రహ్మోత్సవం డేట్ కోసం మహేష్ అభిమానుల కంటే కూడా అ..ఆ యూనిట్ సభ్యులు చాలా ఆత్రంగా చూస్తున్నారు. 

ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ డేట్ ను బట్టే వీళ్లు విడుదల ఖరారు చేసుకోవాలి. బ్రహ్మోత్సవం 20న కన్ఫమ్ అని ముందే తెలిస్తే 13న అ..ఆ వచ్చేసేదేమో. కానీ ఇప్పుడు టైం తక్కువుంది. ఆ డేట్ ఫిక్స్ చేయడం కష్టమే. ఇక బ్రహ్మోత్సవం వచ్చిన వారానికే విడుదల అన్నా కూడా కష్టమే. అలా కాదంటే జూన్ 3కు వెళ్లాలి. కానీ ఆ తేదీకి కబాలి రిలీజ్ అంటున్నారు. కానీ అక్కడి నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి కబాలి టీం నుంచి న్యూస్ కోసం ఎదురు చూడాలన్నమాట ఇక. కబాలి కొంచెం వాయిదా పడితే.. అ..ఆ జూన్ 3న రావడం పక్కా. మొత్తానికి అ..ఆ పోస్టర్లలో వేసినట్లు మేలో రావడం డౌటే. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయాక నెల రోజులకు పైగా వెయిట్ చేయాల్సి రావడం ఇబ్బందికరమే. ఇంతకుముందు ప్రచారం జరిగినట్లు బ్రహ్మోత్సవం మే 27కు ఫిక్స్ అయి ఉంటే.. అ..ఆ 20కి ఫిక్సయ్యేదేమో! -


suryaa.com

జైపాల్ ను అసలు కథ చెప్పమంటున్న ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. విభజనకు ముందు నాటి పరిణామాలపై ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరించి సుమారు వారం అవుతున్నా అది రేపుతున్న రచ్చ ఇంకా ముగియలేదు. విభజన ముందు గంటలో స్పీకర్ చాంబర్ లో ఏమి జరిగిందన్నది ఉండవల్లి తన పుస్తకం లో రాయగా అదంతా కట్టుకథ అని తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆ వెంటనే ఆక్షేపించారు. ఉండవల్లివన్నీ కట్టుకథలని ఆరోపించారు. దీంతో తాజాగా ఉండవల్లి మళ్లీ జైపాల్ కు కౌంటరేశారు. తాను చెప్పింది కట్టు కథ అయితే అసలు కథేంటో జైపాల్ రెడ్డే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

విభజనకు ముందు గంట సమయంలో ఏం జరిగిందన్న నిజాన్ని బయటపెట్టాలని జైపాల్ రెడ్డిని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. తను రాసిన విభజన కథ పుస్తకం కట్టు కథ అయితే అసలు నిజమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలన్నారు. విభజన కథ పుస్తకంలో ఉండవల్లి కట్టు కథ రాశారని అసలు విషయం బయటపెట్టాలంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి చెప్పడానికి వీల్లేదని జైపాల్ రెడ్డి ఇటీవల గాంధీభవన్ లో విమర్శించడంపై స్పందించిన ఉండవల్లి రీసెంటుగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పలు ప్రశ్నలను సంధించారు. పుస్తకంలో రాసిన తన ఊహ తప్పయితే నిజమేమిటో చెప్పాలని జైపాల్ రెడ్డిని నిలదీశారు.  తనది అంతా కట్టుకథ అన్నా కూడా సరిపెట్టుకుంటానని... అయితే అసలు విషయమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలని కోరుతున్నానన్నారు. 

విభజన జరిగే సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య స్పీకర్ చాంబర్ లో ఏమి జరిగిందో తాను ఊహించి రాశానన్నారు. లోపల జరిగింది కుట్ర అనర్థం రాజ్యాంగ విరుద్ధమని తాను ఊహించి రాసినప్పటికీ నిజమేమిటో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జైపాల్ రెడ్డి వెళ్ళి చెబితేనే తెలంగాణ వచ్చిందని లేదంటే తెలంగాణ లేదని ఆయనే స్వయంగా ప్రకటించారని కాబట్టి రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఆ విషయం ఏమిటో బయటపెట్టాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అపార అనుభవం కలిగిన జైపాల్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై గౌరవం వుంటే పారదర్శకతకు అర్థం తెలిసివుంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని నిజమేమిటో ఒప్పుకోవాలని కోరారు. జైపాల్ రెడ్డి స్థాయి వ్యక్తే సెంటిమెంట్ కులోనై తప్పుడు సలహా ఇచ్చానని ఒప్పుకుంటే ఆయన వ్యక్తిత్వం మరింత పెరుగుతుందన్నారు. మొత్తానికి ఏపీలో జైపాల్ ను విలన్ ను చేస్తున్నా తెలంగాణలో హీరోగా చేసే పనిని ఉండవల్లి ఎత్తుకుంటున్నట్లుగా ఉంది. విభజన నిర్ణయానికి కారణం జైపాలే అన్నట్లుగా ఉండవల్లి ఆరోపిస్తుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ - జైపాల్ రెడ్డిలు ఇద్దరి గ్రాఫ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది.tupaki.com

సరికొత్త లుక్‌ కోసం ట్రీట్‌మెంట్‌

ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన ఆ మాస్ హీరోకు ఈ మధ్య సరైన విజయాలు దక్కడం లేదు. హిట్ కోసం కొత్త సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే త్వరలో ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళుతున్నాడట. ఇండ్రస్టీలో ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన హీరోలు కొత్త సినిమాలు కమిటయ్యే విషయంలో కొంత గ్యాప్ తీసుకుంటుంటారు. నయా మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే జాగ్రత్త కారణంగానే హీరోలు ఈ విధంగా గ్యాప్ తీసుకుంటారని టాక్. కానీ, లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 'బెంగాల్ టైగర్'గా ఆడియెన్స్ ముందుకొచ్చిన మాస్ హీరో రవితేజ విషయంలోనూ ఎప్పటికప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. 

ఆ మధ్య దిల్ రాజు బ్యానర్‌లో రవితేజ 'ఎవడో ఒకడు' అనే సినిమాకు ఓకే చెప్పాడని, అయితే రెమ్యూరేషన్ విషయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందనే గుసగుసలు వినిపించాయి. అప్పటి నుంచి రవితేజ కొత్త సినిమా విషయంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా రవితేజతో రైటర్ విక్రమ్ సిరి సినిమా తెరకెక్కించబోతున్నాడని త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లొచ్చన్నది సినీజనం మాట. ఈ సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్న రవితేజ, అందుకోసం త్వరలోనే ఫారిన్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోబోతు న్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఫిజిక్ మరింత అట్రాక్టివ్‌గా కనిపించేందుకు రిజువినేషన్ థెరపీ చేయించుకోవడా నికి రవితేజ డిసైడయ్యాడని, ఇందుకోసమే ఈ మాస్ హీరో విదేశాలకు వెళుతు న్నాడని వినిపిస్తోంది. మొత్తానికి వరుస ఫ్లాపులకు చెక్ పెట్టి, మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న మాస్ మహారాజా అందుకోసం బాగానే కష్టపడు తున్నట్టు అర్థమ వుతోంది.
suryaa.com

శ్రీరస్తు శుభమస్తు 50 డేస్ కలెక్షన్స్

అల్లు శిరీష్ హీరోగా నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా మంచి విజయాన్ని సాధించింది. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్ కు ఈ సినిమా మంచి హిట్ ఇచ్చి జోష్ ని నింపింది. ఫ్యామిలీ అంద్ యూత్ ని మెప్పించే సినిమాగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తుకు ఫైనల్ గా అన్ని ఏరియాల్లోను మంచి వసూళ్లు రావడంతో పాటు ఈ సినిమాని కొన్న బయ్యర్ల నుంచి నిర్మాతలు ఇలా అందరికి లాభాలను తెచ్చింది. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 50 రోజుల వసూళ్ళు ప్రపంచవ్యాప్తంగా 20.20 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టింది. ఇక 10.02 కోట్ల షేర్ రాబట్టింది.

నైజాం = 2.64
సీడెడ్ = 1.35
కృష్ణా = 0.81
గుంటూరు = 0.83
వెస్ట్ = 0.70
ఈస్ట్ = 0.77
వైజాగ్ = 1.65
నెల్లూరు = 0.31
ఏపీ+తెలంగాణ‌ = 9.06 కోట్లు
క‌ర్ణాట‌క = 0.51 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ + రెస్టాఫ్ ఇండియా = 0.45 లక్ష‌లు
టోట‌ల్ వ‌సూళ్లు =10.20 కోట్లు (షేర్‌)
గ్రాస్ వ‌సూళ్లు = 20.20 కోట్లు ( గ్రాస్‌)
andhravilas.net

ప్రత్యేక హోదా గళాలపై వేటు?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం శాసనసభ లోపల, వెలుపల నిరంతరం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. శుక్రవారం శాసనసభ హక్కుల కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(వైఎస్సార్‌సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్, బీసీ జనార్ధనరెడ్డి (టీడీపీ) పాల్గొన్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీవరకు జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ప్రధానంగా చర్చ జరిగింది.

తిరిగి అక్టోబర్ 14, 15 తేదీల్లో విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించారు. తొలుత గొల్లపల్లి మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా సభ సిఫారసు చేసిందని, దీంతో సమావేశం కావాల్సి వచ్చిందని చెప్పారు. అనంతరం ఆ మూడు రోజుల్లో సభ జరిగిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించగా సభ్యులు వీక్షించారు. సభా కార్యక్రమాలకు అడ్డం పడ్డారంటూ కొందర్ని గుర్తించిన కమిటీ వారికి నోటీసులు జారీ చేసి వాదనలు వినాలని నిర్ణయించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై పట్టుబట్టి సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, ప్రజల మనోభావాలను ప్రతిబింబింపజేసేందుకు ప్రయత్నించిన వారిపై  చర్య తీసుకోవాలనే కమిటీ ఆలోచన  సరికాదని, ఇలా చేస్తే ప్రత్యేక హోదా ఆకాంక్షతో పోరాటం చేస్తున్న వారిని అవమానించినట్లేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చైర్మన్  గొల్లపల్లితో పాటు టీడీపీ సభ్యులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ సభ్యులు సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ. వారిని తప్పుబట్టే ప్రయత్నం చేశారు. పెద్దిరెడ్డి వారి వాదనలు తోసిపుచ్చారు.

 ప్రభుత్వం కుట్ర పన్నింది: పెద్దిరెడ్డి
  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందని మండిపడ్డారు.

 చెవిరెడ్డిని ఎందుకు చేర్చలేదు?
 తమ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ స్థానంలో హక్కుల కమిటీ సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ప్రతిపాదిస్తే ఇప్పటివరకు ఎందుకు నియామకం చేపట్టలేదని శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. హక్కుల కమిటీ భేటీ సమయంలో అక్కడికి వచ్చిన సత్యనారాయణతో ఆయన ఈ విషయం ప్రస్తావించారు.


sakshi.com

రెండేళ్ల తర్వాతే పెళ్లి!

టాలీవుడ్‌లో ఎలిజిబుల్ బ్యాచిలర్ల సంఖ్య తగ్గిపోతోంది. గతేడాది నుంచి చాలామంది కుర్ర హీరోల పెళ్లిళ్లు జరగ్గా.. రీసెంట్‌గా నాగ చైతన్య.. అఖిల్‌లు కూడా పెళ్లి బాట పట్టేశారు. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న దగ్గుబాటి రానా మాత్రం పెళ్లి కబురు వినిపించడం లేదు. చైతు.. అఖిల్‌లు కూడా పెళ్లికి సై అనేయడంతో.. వాళ్లకు బావ వరుసయ్యే రానా ఇంకా బ్యాచిలర్ గానే ఉండడం.. ఇంట్లోవాళ్లని కాస్త ఇబ్బంది పెడుతోంది. గతంలోనే ఈ హీరోకి కొంతమంది హీరోయిన్స్‌తో లవ్ అంట టాక్ వినిపించింది. ఈ లిస్ట్‌లో చెన్నై బ్యూటీ త్రిష పేరు కూడా ఉంది కానీ.. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరూ తేల్చేశారు. అయితే.. ఇప్పుడు ఇంట్లోనుంచి పెళ్లి విషయంలో ఎంత ప్రెజర్ వస్తున్నా రానా మాత్రం మనసు మార్చుకోవడం లేదట. 

తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే మూడ్ లేదని తేల్చేస్తున్నాడట హీరో. ఇందుకు కారణంగా.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమా కమిట్మెంట్స్ ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్న రానా.. రీసెంట్ గానే దాన్ని ఫినిష్ చేశాడు. తేజ దర్శకత్వంలో రూపొందే నేనే రాజు- నేనే మంత్రితో పాటు.. ఇండియాలో మొదటి సబ్ మెరైన్ మూవీ ఘాజీలోను.. రెజీనా ప్రధాన పాత్రలో తెరకెక్కే తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ లోనూ రానా నటించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యే సరికి రెండేళ్లు పడుతుందని.. ఆ తర్వాతే పెళ్లి సంగతి ఆలోచిస్తానని తేల్చేస్తున్నాడట రానా.
suryaa.com

హోదాపై నేను అలా అనలేదు..

ప్రత్యేక హోదా విషయంలో తాను మాట్లాడిన మాటకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. ఈనెల 17న విజయవాడలో ప్రత్యేక ప్యాకేజీ అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ‘ఆ వేడిలో హోదా అన్నా..’ అంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యలను ‘సాక్షి’ అదే శీర్షికన ప్రచురించింది. అయితే విశాఖలో సీ ఫుడ్ ఇండియా ఇంటర్నేషనల్ షో సందర్భంగా శుక్రవారం వెంకయ్య మాట్లాడారు. ఆంగ్లంలో ప్రసంగిస్తున్న మంత్రి మధ్యలో తెలుగులోకి వచ్చారు. ‘వేడిలో హోదా అన్నానంటూ.. ఓ పత్రికలో రాశారు. వేడిలో నేనెందుకంటాను. వేడిగా ఉన్నప్పుడే దానిని (హోదాను) చట్టంలో చేర్చి ఉంటే సరిపోయేదన్నాను.

ఆ రోజు పార్లమెంటులో తలుపులు మూశారు. దూరదర్శన్ ప్రసారాలు నిలిపేశారు. మైకులు ఆపేశారు. అన్నీ బంద్ చేశారు. ఆ సమయంలో నా వాయిస్ వినిపించాను. ఏపీ ప్రజల తరఫున ఆ రోజు నేను పార్లమెంటులో లేవనెత్తకపోతే ఎవరూ మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదు. ఏపీ భవిష్యత్ అంధకార బంధురం అయి ఉండేది. ప్రజలు నేతలకంటే తెలివైనవారు. అన్నీ తెలుసుకుంటారు. నేనేమీ ఆందోళన చెందను..’ అంటూ ఆ అంశాన్ని ముగించారు.

కాంగ్రెస్ కు దారుణ అవమానం పొంచి ఉందా?

కొన్ని విషయాలు వినేందుకే విచిత్రంగా అనిపిస్తాయి. దేశంలో ఇప్పటివరకూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోనే అధిక కాలం పాలన సాగిన విషయం తెలిసిందే. మరి దేశాన్నే నడిపించిన ఈ పార్టీ.. ఎన్నో నియమనిబంధనల్ని తీసుకొచ్చింది. చట్టాల్ని తయారుచేయటమే కానీ వాటిని అమలు చేయటం అవసరం లేదన్నభావన కాంగ్రెస్ కు ఉందా? అన్న సందేహం కలిగే ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది.

అదెలాగంటే.. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆఫీసును కేంద్రం స్వాధీనం చేసుకోనుందా? అంటే ఏమో.. అలా జరగొచ్చేమోనన్న అభిప్రాయం కలగక మానదు. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం నిర్దేశిత అద్దె చెల్లించాల్సిన కాంగ్రెస్.. చెల్లించలేదన్న ఆరోపణ తెర మీదకు రావటమే. ఎన్నో చట్టాల్ని రూపొందించిన అనుభవం ఉన్న నేతలు కాంగ్రెస్ లో పుష్కలంగా ఉంటారు. అలాంటి వారున్న పార్టీ రూల్స్ ను పాటించకపోవటం ఆశ్చర్యం కలిగించటం ఖాయం. ఢిల్లీలోకాంగ్రెస్ పార్టీకి మూడు ఆపీసులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ అద్దెకు తీసుకుంది. అందులో ఒకటి 24 అక్బర్ రోడ్డులో.. రెండోది 5 రైసినా రోడ్డులో ఉన్న భవనం.. మూడోది చాణక్యపురిలో మరో కార్యాలయం ఉంది. వీటిల్లో పార్టీతో పాటు.. పార్టీ అనుబంధ కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే.. 2010లో రౌస్ అవెన్యూలో అప్పటి ప్రభుత్వం.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు భూమిని కేటాయించింది. భూమిని కేటాయించిన మూడేళ్లలో ఆఫీసును నిర్మించాల్సి ఉంటుంది. కానీ.. ఆ పని చేయని పక్షంలో ప్రభుత్వం భూమిని తిరిగి తీసుకునే వీలు ఉంటుంది. ఏమైందో కానీ.. దాదాపు ఆరేళ్ల క్రితం భూమిని కేటాయించినా ఇప్పటివరకూ కాంగ్రెస్ భవనాన్ని నిర్మించలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న 24 అక్బర్ రోడ్ లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని 2013లో ఖాళీ చేయాల్సిఉంది. అయితే.. భవన నిర్మాణం పూర్తి కాకపోవటంతో పార్టీ ఆఫీసును ఖాళీ చేయలేదు. అదే సమయంలో చెల్లించాల్సిన నిర్దేశిత అద్దె చెల్లించటం లేదు. దీంతో.. మోడీ సర్కారు పవర్ లోకి వచ్చిన వెంటనే (2015 జనవరిలో) నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటంతో అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారట. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుంది..? 


tupaki.com

చైతూపై ప్రేమమ్‌ కురిపిస్తుందా?

తను చేసిన సినిమాలపైనే కాదు.. తనకు నచ్చిన సినిమాల పైనా.. ట్వీట్స్ చేయడం సమంతకు అలవాటు. అంతే కాదు.. అభిమానులతో అనేక సంగతులు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఈ భామ హ్యాబిట్. రీసెంట్ గా పింక్ మూవీని.. ఆ చిత్ర యూనిట్ ని తెగ పొగిడేస్తూ ట్వీట్ చేసింది సమంత. 'ఈ ఏడాది మనం చూసిన సినిమాల్లో పింక్ చాలా ముఖ్యమైనది. బ్రిలియంట్. 

టీమ్ నా గ్రేట్ రెస్పెక్ట్' అంటూ ట్వీట్ చేసింది సమంత. తాప్సీ నటించిన మూవీపై ట్వీట్ బాగానే ఉంది కానీ.. జనాలు ఈమె దగ్గర నుంచి ఆశిస్తున్నది వేరే ఉంది. శామ్ కు కాబోయే భర్త అయిన నాగచైతన్య అప్ కమింగ్ మూవీ ప్రేమమ్ పై.. సమంత ట్వీట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. అయితే.. సమంత మాత్రం ప్రేమమ్ పై తను ఎలాంటి ట్వీట్ చేయడం లేదు సరి కదా.. కనీసం చైతు ట్వీట్ ను రీట్వీట్ కూడా చేయడం లేదు. పింక్.. జనతా గ్యారేజ్ లపై ట్వీట్లతో సరిపెట్టేస్తోంది. ప్రేమమ్‌పౖౖె తన ట్వీట్ పై ఆసక్తి ఉందనే సంగతి సమంతకు బాగానే తెలుసు. ఇప్పటికే బోలెడన్ని క్వశ్చన్స్ ఆమె టైమ్ లైన్ లో పోస్ట్ అవుతున్నాయి. ఈ క్యూరియాసిటీని మరింతగా పెంచేసే వ్యూహం తోనే.. సమంత ఇలా ఉద్దేశ్యపూర్వకంగా ప్రేమమ్ పై ట్వీట్లను అవాయిడ్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే ఈమె ఆలోచన వర్కవుట్ అయ్యేలానే ఉంది.

ఎక్కడి అక్కౌంట్లు అక్కడ గప్ చుప్

ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ హడావుడితో ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడి అక్కౌంట్లు అక్కడ గప్ చుప్ అయిపోతున్నాయట. ఆదాయపన్ను శాఖ బడా బాబులపై కన్నేసిందని వార్తలు గుప్పుమనడంతో, నల్లధనంతోనే ఎక్కువగా లావాదేవీలు నడిచే సినిమా ఇండస్ట్రీ ఉలిక్కి పడుతోంది. టాలీవుడ్ బడా హీరోల దగ్గర వున్నంత బ్లాక్ మనీ మరెక్కడా వుండదు.  

ఎందుకంటే సగానికి పైగా పారితోషికం బ్లాక్ లోనే తీసుకుంటారని వినికిడి. టాప్ హీరోల పారితోషికం పది కోట్ల నుంచి పాతిక కోట్ల వరకు వుంది. ఇందులో సగానికి పైగా నల్లధనమే అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే బడా నిర్మాతలు ఛాలా మంది వున్నారు. ఇప్పుడు ఆదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో చాలా మంది తమ తమ ఆఫీసులను మార్చేసారు. అక్కౌంట్స్ ను వేరే చోటకు చేర్చి, పక్కగా చేసుకునే పనిలో పడ్డారు. 

ఆదాయపన్ను శాఖ కూడా భలే చిత్రంగా వ్యవహరించింది. పది నుంచి పాతిక కోట్లు తీసుకునే హీరోలను, భారీ సినిమాలు అనేకం తీసే నిర్మాతలను పక్కన పెట్టి, రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యి, ఆర్థికంగా కాస్త దెబ్బతిని వున్న సాయి కొర్రపాటి లాంటి నిర్మాతపై తొలి దాడి చేసింది. అంతే మిగిలిన పెద్ద చేపలన్నీ గప్ చుప్ అయిపోయాయి. ఆ మధ్య ఓ సినిమా 66 కోట్లు, ఈ మధ్య ఇంకో సినిమా 76 కోట్లు, ఓ సంక్రాంతి సినిమా  55 కోట్లు,టాప్ హీరో ఫ్లాప్ సినిమా 70 కోట్లు (బిజినెస్) ఇలా ఎన్ని భారీ సినిమాలు వున్నాయి కళ్లెదుట. 
కానీ చిత్రంగా మనమంతా, రాజా చేయి వేస్తే వంటి విఫలయత్నాలు చేసిన నిర్మాత మీద దాడి జరిగింది.  ఇప్పుడు టాలీవుఢ్ మొత్తం అక్కౌంట్ల సర్దుబాటు, ఇళ్లలో, కార్యాలయాల్లో లెక్క లేని క్యాష్ లేకుండా చూసుకొవడం, ఇత్యాది వ్యవహారాల్లో బిజీ అయిపోయింది.http://telugu.greatandhra.com/

నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది?

‘నేనేదో కేసులకు భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నా మీద ఎలాంటి కేసులు లేవు. నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది. 25 కేసులు పెట్టారు. కోర్టుకు పోతే కొట్టేశారు. ఎవరు ఎన్నిసార్లు కోర్టుకు పోయినా ఏ కోర్టు నన్ను తప్పుపట్టలేకపోయిందంటే అది నా క్రమశిక్షణ నా నిబద్ధత’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు.

దివంగత వైఎస్సార్ హయాంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద పరవాడ మండలం గొర్లివానిపాలెంలో రూ.36 కోట్లతో శ్రీకారం చుట్టిన నివాస సముదాయం (జీ ప్లస్ టూ కింద 1,839 ఫ్లాట్లు)తో పాటు మరో రూ.14 కోట్లతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను శుక్రవారం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కాగా విలేకరుల సమావేశంలో ప్రశ్నలడిగిన మీడియా ప్రతినిధులపై చంద్రబాబు మండిపడ్డారు.

మెగా అభిమానులకు శుభవార్త!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఫ్యాన్స్‌కి ఓ ట్రీట్ ఇచ్చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22నే తన 150 చిత్రం టైటిల్ తో పాటు.. తన ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసేశారు. ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్.. ఫస్ట్ లుక్ లో కనిపించిన ఇంటెన్సిటీ.. మెగాస్టార్ కోసం అభిమానుల ఆరాటాన్ని మరింత పెంచేశాయి. అయితే.. ఇప్పుడు అక్టోబర్‌లో మరోసారి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అందించనున్నారు చిరు. ఈ సారి మెగాస్టార్ అందించే కనువిందు.. బుల్లితెరపై కావడం విశేషం. తెలుగులో సూపర్ సక్సెస్ సాధించిన రియాలిటీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం నాలుగో సీజన్‌ను.. చిరు హోస్ట్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇప్పటివరకూ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రాలేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని చిరు చేస్తున్నారనే విషయాన్ని గ్రాండ్ గా అనౌన్స్ చేసేందుకు గాను.. ఓ ప్రోమోను డిజైన్ చేసిందట ఆ ఛానల్. ఇలా చిరంజీవిని హాట్ సీట్ కు ఎదురుగా చూపించే ప్రోమోను.. అక్టోబర్ లో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

చిరంజీవి చేరికతో ఈ రియాలిటీ క్విజ్ కార్యక్రమానికి మరింత ఆకర్షణ చేకూరగా.. దీన్ని ఆయన ఎలా నిర్వహిస్తారనే ఆసక్తి కూడా నెలకొంది. అయితే.. దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కావాల్సిన మెగాపవర్ స్టార్ ధృవ వాయిదా పడ్డంతో నీరసపడ్డ అభిమానులకు.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దర్శనమిస్తుండడం సంతోషాన్నిస్తోంది

suryaa.com

ఎన్టీఆర్ లేటెస్ట్ ఛాయిస్ వినాయక్..?

సరైన డైరక్టర్ కోసం వెదుకులాడుతున్నాడు ఎన్టీఆర్. ఇక్కడ సమస్య ఏమిటంటే డైరక్టర్ మాత్రమే కాదు, మళ్లీ డెభై కోట్ల కలెక్షన్లు తేగలిగిన డైరక్టర్ కావాలి. అక్కడే సమస్య వస్తోంది. అలాంటి డైరక్టర్ ఎవరూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. చుట్టూ తిరుగుతున్న ఒకరిద్దరికి ఆ స్టామినా లేదు. కాస్త నమ్మకాలు తక్కువ. బోయపాటి చూస్తే లాక్ అయి కూర్చున్నాడు. 
ఇక ఎన్టీఆర్ ప్రేమగా వినయన్న అని పిల్చుకునే వివి వినాయక్ అయితే ఎలా వుంటుంది అన్న డిస్కషన్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వినాయక్ డిసెంబర్ తో ఫ్రీ అవుతున్నారు. చిరంజీవి 150 వ సినిమా జనవరి విడుదలకు రెడీ అవుతోంది. అంటే ఆ మేరకు ఖాళీ అవుతారు. 
వినాయక్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఆరేడేళ్లయిపోతోంది. పైగా అఖిల్, యోగి లాంటి ఒకటి రెండు తప్ప, వినాయక్ సినిమాలకు కాస్త మినిమమ్ గ్యారంటీ వుంటుంది. పైగా ఎన్టీఆర్ అంటే వినాయక్ కు అభిమానం కూడాను. అందువల్ల ఈ కాంబినేషన్ అయితే ఎలా వుంటుంది అన్న డిస్కషన్లు నడుస్తున్నట్లు వినికిడి.


http://telugu.greatandhra.com/

‘నయీండైరీ అంటూ మాపై బురద చల్లితే ఊరుకోం’

అసలు ఉందో లేదో తెలియని గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని అడ్డం పెట్టుకుని తమ పార్టీకి చెందిన నేతలపై బురద చల్లి బెదిరించాలని చూస్తే సహించేది లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ డైరీ గురించి పత్రికల్లో వార్తలు రావడమే తప్ప అతని డైరీ ఉందని కాని, అందులో కొందరి పేర్లు ఉన్నాయని కాని అధికారికంగా సిట్ అధికారులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. డైరీ నిజంగానే ఉంటే దానిని ప్రభుత్వం సీజ్ చేసి, అందులో ఉన్న నిందితుల పేర్లను అధికారికంగాప్రకటించాలన్నారు. టీడీపీ నేతలపై బురదచల్లి, బెదిరించి, లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే కథనాలు వస్తున్నాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో కొందరు విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.

సినిమా గిఫ్ట్ ల వెనుక వైనం అదేనా?

సినిమా హిట్ అయిందని నిర్మాత కారు ఇచ్చాడు..హీరో ఇంకోటి ఇచ్చాడు..ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. నిజానికి ఇవన్నీ బోగస్ నే. దీని వెనుక తతంగం వేరే వుంటుంది. వీళ్ల డబ్బులతోనే కొని వీళ్లకే గిఫ్ట్ లు ఇవ్వడం అన్నది టాలీవుడ్ లో జరిగే తంతు.
బిఎమ్ డబ్ల్యు, ఆడి, ఇలాంటి భారీ కార్లు కొన్నారు అంటే, ఆదాయ పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడినట్లే. వారికి సమాచారం వెళ్లిపోతుంది. అలాగే భారీగా ఆస్తులు కొన్నా. అందుకే తమ బ్లాక్ మని అవతలి వారికి ఇచ్చి, వారి వైట్ మనీని తమ వాహనంగా మారుస్తారు. 
ఆ మేరకు గిఫ్ట్ టాక్స్ లు వగైరా వుంటే వీళ్లు కట్టేసుకుంటారు. వాళ్లకి ఆదాయంలో గిఫ్ట్ కింద కట్ అయిపోతుంది. వీళ్లకు గిఫ్ట్ కింద వస్తుంది. కృతజ్ఞత లేదా మొహమాటం, లేదా మరో సినిమాకు అడ్వాన్స్ కింద ఇలాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. అంతే తప్ప, ఓ ప్రేమ కారిపోయి కాదు, మరేమీ కాదుhttp://telugu.greatandhra.com/

కోలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లియర్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి టాలీవుడ్‌లోనే మల్లూవుడ్‌లో కూడా బోలెడంత డిమాండ్ ఉంది. వేరే రాష్ట్రంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకోగలిగిన మొదటి తెలుగు స్టార్ హీరోగా బన్నీకి రికార్డు ఉంది. సౌత్ అంతా దీన్ని విస్తరించాలనే ఆలోచన అల్లు అర్జున్‌కి ముందు నుంచి ఉండడంతో.. 

కోలీవుడ్‌లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు బన్నీ-లింగుస్వామి ప్రాజెక్టు ఓకే అయిందని.. ఇవాళో రేపో దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చని తెలుస్తోంది. 'తెలుగు-తమిళ భాషల్లో బైలింగ్యువల్‌గా ఓ చిత్రం తెరకెక్కనుండగా.. ఇది బన్నీకి తొలి తమిళ్ మూవీ కానుంది' అంటున్నారు సన్నిహితులు. గతంలో తమిళ్ డబ్బింగ్ మూవీస్ ఉన్నా.. డైరెక్టుగా తమిళ్ లో చేయడం మాత్రం ఇదే మొదలు అవుతుంది. నిజానికి లింగుస్వామితో ప్రాజెక్టుపై గతంలోనే చర్చలు జరిగాయి. కానీ కొన్ని విబేధాల కారణంగా ఇది ఆగిపోయింది. ఆ తర్వాత వేరే స్టోరీతో జూనియర్ ఎన్టీఆర్ ని కలిశాడు లింగుస్వామి. అది కూడా ఇంకా పట్టాలెక్కలేదు. 

దీంతో లింగుస్వామిని పిలిపించి మాట్లాడుకుని.. డిఫరెన్సులను తొలగించి ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేశాడట స్టైలిష్ స్టార్. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో దువ్వాడ జగన్నాధం స్టార్ట్ చేయనున్న బన్నీ.. లింగుస్వామి ప్రాజెక్టును కూడా మొదలుపెట్టేస్తాడట. రెండు సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరగనున్నాయని సమాచారం.

suryaa.com

'బాధితులను ఆదుకోవటంలో సర్కారు విఫలం'

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా పాలకులు పెడచెవిన పెట్టారని టీటీడీపీ విమర్శించింది. ముంపు బాధితులను ఆదుకోవడంలోనూ, కనీసం మంచినీళ్లు, ఆహారపొట్లాలు, మందులను అందించడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, బస్తీలు జలదిగ్భంధంలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడుతుంటే ప్రభుత్వం బాధితుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు.

ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో వారు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సందర్భంగా ముంపు బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు నాయకులు, అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగుయువత నాయకులు సహాయచర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ప్రీ నెంబర్‌కు బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ర్ట కార్యాలయంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.

అల్వాల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్...

హైదరాబాద్‌లో వర్షభీభత్సవంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూప ుతున్నారు. వర్షంతో నీటమునిగిన కాలనీలు, లోతట్టు ప్రాంతాలలోని సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తూ, అలాగే బాధితుల సమస్యలు తెలుసుకొంటూనే ఉన్నారు. గురువారం అర్థరాత్రి వరకు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించి, బాధితుల వినతులు స్వీకరించిన మంత్రి శుక్రవారంనాడు వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్‌సాగర్ వద్ద పరిస్థితిని మంత్రి సమీక్షించారు. అక్కడి నుంచి అల్వాల్ వెళ్లిన మంత్రి స్థానికుల సమస్య లు అడిగి తెలుసుకున్నారు. అల్వాల్, మోత్కుంట, కొత్త చెరువులు, నాలాలను మంత్రి పరిశీలించారు. వరద బాధితులకు సత్వరమే సహాయక, పునరా వాసకార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

ముంపు ప్రాంతాల్లో సహాయక, పునరావాసం వేగిరం...
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక, పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లోని నివాసి తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఉచిత భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ, ఫైర్‌శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారన్నారు. నగరంలోని నిండిన చెర్వులు, కుంటల వద్ద ముందుజాగ్రత్త చర్యలు చేపట్టా మన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను మ్యాపింగ్‌చేసి ఆయా ప్రాంతాల్లో అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. సివరేజ్ వ్యవస్థను సమీక్ష ిస్తున్న ట్లు కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గంటగంటలకు పరిస్థి తులను సమీక్ష ిస్తున్నారని, ఎలాంటి అంటువ్యాధులు ప్రబతలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలియోపై పుకార్లను నమ్మో ద్దని విజ్ఞప్తి చేశారు. రెము మాసాల్లో నగరంలోని అన్ని రోడ్లను పూర్తిస్థాయిలో నిర్మిస్తా మన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, లక్ష్మారెడ్డి, మేయర్ బొంతురామ్మోహన్, కమిషనర్ జనార్థన్‌రెడ్డి పాల్గొన్నారు

ప్రజలు హోదా కోరుకుంటున్నారు: పల్లె

రాష్ర్టంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అనేదానితో తాను ఏకీభవిస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. హోదా కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు దానికంటే బాగుంటాయని నమ్ముతున్నానని అన్నారు. గురువారం రాత్రి చెన్నై వెళుతూ మార్గమధ్యంలో తెనాలి రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

జడపట్టి లాగడంతో విగ్గు ఊడి..!

ఈ మధ్య ప్రాంక్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో పెట్టి క్లిక్‌లు తెచ్చుకోవడం యువతకు బాగా అలవాటైంది. అయితే, నిజజీవితంలో సరదా సన్నివేశాలను సృష్టించి.. వాటిని కెమెరాలో బంధించాలన్న ప్రయత్నం అన్నిసార్లు సజావుగా సాగకపోవచ్చు. 'పెళ్లిచూపులు' సినిమాలోలాగా కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొట్టే.. తీసినవారే బాధితులు అయ్యే అవకాశముంటుంది.  

కొందరు టీనేజ్‌ కుర్రాళ్లు ఇలాగే తమ స్కూల్‌లో ప్రాంక్‌ వీడియో తీయాలనుకున్నారు. క్యాంటీన్‌లో అమ్మాయిల వెనుక కూర్చిలో కూర్చొని వారి పిలకజడలను పట్టుకొని లాగారు. ఇద్దరు అమ్మాయిల జట్టు గట్టిగానే ఉంది. కానీ మూడో అమ్మాయి జుట్టే విగ్‌ కావడంతో అది ఊడివచ్చింది. అంతే ఆ నల్ల అమ్మాయి కోపం కట్టలు తెగింది. ఈడ్చి ఒక్కటి ఇచ్చింది. జుట్టు పీకినవాడు దెబ్బకు అడ్డం పడ్డాడు. ఇప్పుడు ప్రాంక్‌ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మీరు ఓ లుక్‌ వేయండి!
 

ఆ సినిమా చూసి ఫిదా అయిన సమంత!

అమిబాత్‌ బచ్చన్‌, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పింక్‌'. లైంగిక వేధింపులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాను బాలీవుడ్‌ ప్రముఖులు పొగడ్తల్లో ముంచెత్తుతుండగా.. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత కూడా ఈ జాబితాలో చేరింది.

సమంతను 'పింక్‌' సినిమా బాగా కదిలించింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లోనే 'పింక్‌' అత్యంత ముఖ్యమైన సినిమా అని ఆమె పేర్కొంది. 'ఈ ఏడాది సినిమాల్లో 'పింక్‌' అత్యంత కీలక సినిమాగా నిలిచిపోతుంది. ఇది నిజంగా గొప్ప సినిమా. చిత్ర యూనిట్‌పై గొప్ప గౌరవం కలిగింది' అని సామ్‌ ట్వీట్‌ చేసింది.

నాయిక ప్రాధాన్యమున్న సినిమాలు దక్షిణాదిలో కూడా రావాలని సమంత చాలాకాలంగా కోరుతూ వస్తున్నది. 'పింక్‌' సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తారని వినిపిస్తోంది. ఈరకంగా సమంత కోరిక కొంతలో కొంత నెరవేరినట్టే. 

వాట్సప్ లో వెంకయ్యపై సెటైర్ హల్ చల్

ఇవ్వాళ సోషల్ మీడియా అంత ఏక్టివ్ గా మరే మీడియా లేదు. కేవలం ఏక్టివ్ గా కాదు, ఇన్నోవేటివ్ గా కూడా. కుర్రాళ్ల క్రియేటివిటీ అదిరిపోతోంది. ఎవరి అభిమానాన్ని వారు చాటుకునేందుకు, ఎవరి అభిప్రాయాన్ని వారు వెరైటీగా చెప్పేందుకు, విజువల్ గా, కామెంట్ల పరంగా సోషల్ మీడియా జనాలు చెలరేగిపోతున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమారుడు ఇండియన్ ఆర్మీకి వెయ్యి నూట పదహార్లు విరాళం ఇవ్వడంపై భయంకరమైన కామెంట్లు వచ్చాయి. దానిపై ఓ లేఖ రూపంలో తయారుచేసిన సెటైర్ ఆర్టికల్ ఇప్పుడు వాట్సప్ లో చలామణీ అవుతోంది. అదే ఇది..చదవండి.
*పెద్దలు వెంకయ్య గారికి, చవటపాలెం గ్రామస్తులు రాయునది..,*
పెద్దలు, కేంద్ర ఏపీ మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గారికి…, మీ స్వగ్రామం చవటపాలెం గ్రామస్థులమందరమూ కూర్చుని మిక్కిలి ఆందోళనతో మీకు రాసుకుంటున్న లేఖ ఏమనగా…!
మన రమణమ్మ, రంగయ్యనాయుడు కొడుకు ఇంత గొప్పగా ఎదిగినందుకు… ఎంతగా ఎదుగుతున్నా తెలుగోడి కోసం మాత్రమే మాట్లాడుతున్న తీరుకు మీ సొంతూరి ప్రజలుగా ఎంతో ఆనందించాం… మిమ్మల్ని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడిగా చేసినా సరే, మీరు మాత్రం మన 13 జిల్లాల గురించే ఆలోచిస్తారనేది మా ప్రగాఢ నమ్మకం… నిరుపేదలను ఉద్దరించటానికి మీరు పెట్టిన స్వర్ణభారతి ట్రస్టు, ఏదో కుటుంబం గడవటానికి మీ కొడుకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం గురించి కథలు వినీ వినీ, మేం ఆనందించామే తప్ప ఏనాడూ చింతించలేదు…
ఒకప్పుడు ఏమీ లేని కుటుంబం ఇప్పుడు వేల కోట్లకు ఎదిగిందంటే దాని వెనుక మీ ఆలోచనలు, కార్యదక్షత, ప్రణాళికలు ఉంటాయి కదా… కానీ ఓ వార్త మమ్మల్ని కలవరపెడుతున్నది… మీరు ఏదో ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కోసం అక్షరాలా వేయి నూటా పదహార్ల రూపాయలను ఉదారంగా విరాళం పంపించారట…
ఏమిటి సారూ? మీరు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా అనేదే మా ఆందోళన… మీ కుటుంబం పచ్చగా ఉంటే, సొంతూరు కదా, అని మాకూ ఏదో ఒకటి చేయకపోరులే అని ఇన్నాళ్లూ ఆశపడుతూ వచ్చాం… మీరిలా దానకర్ణుడి వారసుడిలా ఇంతింతగా దానాలు చేస్తూ పోతే, మీ వేల కోట్లు ఆరిపోవటానికి ఎంతోకాలం పట్టదు సారూ? మళ్లీ మీరు జీరో స్థాయికి చేరినా సరే, మిమ్మల్ని మీ సొంతూరు కన్నతల్లిలా అక్కున చేర్చుకుంటుంది… కానీ ఎందుకా సాహసాలు? గతంలో కూడా మీరు అలాగే మద్యనిషేధ ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మకు ఏకంగా 50 వేల రూపాయల విరాళం ఇచ్చారనగానే మాకూ ఒళ్లు జల్లుమంది… 
ఏమిటీ వెంకయ్య గారూ, ఇలా ఆస్తులన్నీ తగలేస్తున్నారనే అనిపించింది… కానీ నగదు ఇస్తామంటూ చెక్ వాపస్ తీసుకుని, మొత్తం ఎగ్గొట్టారనే వార్తలు ఎంతోకొంత మాకు రిలీఫ్ కలిగించాయి… కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి… మీకు కొండంత ఆస్తి ఉంది, కానీ దాన్ని పెంచండి తప్ప కరిగించొద్దు… ఇలా ఎడాపెడా, విచ్చలవిడిగా దానాలు చేస్తే, ఇక మీ మనమలు, మనరాళ్లకు ఏం మిగిలిస్తారు? యురి ఉగ్రవాద దాడి దురదృష్టకరమే… కానీ దానికి ఇంతగా మీరు స్పందించి, బాధపడి, కన్నీళ్లుపెట్టుకుని, ఖండించేసి, ఇలా విపరీతంగా విరాళాలు ఇవ్వడం మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది… పెద్ద పెద్ద టాటాలు, అంబానీలు, ఆదానీలు, వేదాంతలకే సాధ్యం
కాని అంతంత మొత్తాల్ని మీరు దానం చేయడం మాకు దిగ్భ్రాంతిని కలిగించింది…
కాబట్టి, ఈ వయసులో మీరు ఇంతటి సాహసాలు చేయకపోవడమే మంచిదని, మీ సొంతూరి ఆప్తులుగా చెప్పడం మా కర్తవ్యంగా భావించి ఇలా లేఖ రాస్తున్నాం… అన్యథా భావించవద్దు… తప్పులుంటే క్షమించగలరు…
సెలవు…


http://telugu.greatandhra.com/
AndhraMetro.com 2016. Powered by Blogger.
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com