Headlines News :
Home » » లండ‌న్‌లో థాచ‌ర్‌కు ఘ‌నంగా అంత్యక్రియ‌లు

లండ‌న్‌లో థాచ‌ర్‌కు ఘ‌నంగా అంత్యక్రియ‌లు


మాజీ ప్రధాని మార్గరెట్ థాచ‌ర్ అంత్యక్రియ‌లు బుధ‌వారం లండ‌న్‌లో ఘ‌నంగా జరిగాయి. థాచ‌ర్ అంతిమ‌యాత్ర సంద‌ర్భంగా లండ‌న్ న‌గ‌ర‌వీధుల్లో మిల‌ట‌రీ సిబ్బందితోపాటు పౌరులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 8న థాచ‌ర్ గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అప్పటినుంచి ఆమె శ‌వ‌పేటికను మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కూ వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో ఉంచారు. ఆ త‌రువాత‌ వైట్ హాల్‌నుంచి సెయింట్ పాల్ కెథెడ్రల్ వ‌ర‌కు ఊరేగించారు. అమెరికాలోని బోస్టన్‌లో పేలుళ్ల నేప‌థ్యంలో థాచ‌ర్ అంతిమ‌యాత్రకు భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com