Headlines News :
Home » , » బెంగుళూరు నగరంలో హైదరాబాద్ తరహాలోనే బాంబు పేలుళ్లు

బెంగుళూరు నగరంలో హైదరాబాద్ తరహాలోనే బాంబు పేలుళ్లు


బెంగుళూరు నగరంలో హైదరాబాద్ తరహాలోనే బుధవారం నాడు రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. నగరంలోని మల్లేశ్వరం ప్రాంతంలో బీజేపీ ఆఫీసు దగ్గర బుధవారం ఉదయం 10.30కు మొదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది గాయపడగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిలో ఎనిమిది మంది పోలీసులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇది జరిగిన మరి మూడు గంటల తర్వాత రద్దీగా ఉండే హెబ్బాళ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది

ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. తొలి ఘటనలో దుండగులు బైకుకు బాంబును అమర్చి పేల్చినట్లు పోలీసులు అనుమానాలు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మల్లేశ్వరం చేరుకుని మంటలను అదుపు చేశారు.

మరోవైపు పేలుడు స్థలి వద్దకు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు కూడా చేరుకుని విచారణ చేపట్టారు. వీరు దర్యాప్తు ప్రారంభించిన కొద్ది సేపటికే బెంగుళూరు కొత్త విమానాశ్రయం సమీపంలోని హెబ్బాళ్ ఫ్లైఓవర్ వద్ద మరో బాంబు పేలింది. ఫ్లైఓవర్ క్రింద దుండగులు బాంబులు అమర్చినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.

సోర్స్ : ఆంధ్రజ్యోతి  
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com