Headlines News :
Home » , , , » కెమెరామేన్ చెప్పిన యాంగిల్‌ను గమనించాలి: ప్రియమణి

కెమెరామేన్ చెప్పిన యాంగిల్‌ను గమనించాలి: ప్రియమణి


పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలన్న విషయాన్ని ప్రియమణి చాలా గట్టిగా నమ్ముతోంది. ఆ విషయం గురించి మాట్లాడుతూ "నటీమణులన్నాక తెరమీద జరిగే ప్రతి విషయం వారి ప్రమేయంతో జరుగుతుందనుకుంటే పొరపాటు. దర్శకుడు చెప్పినట్టు చేయాలి. కాస్ట్యూమ్ డిజైనర్ డిజైన్ చేసిన దుస్తులను వేసుకోవాలి. కెమెరామేన్ చెప్పిన యాంగిల్‌ను గమనించాలి. కొరియోగ్రాఫర్ నేర్పిన స్టెప్పులు వేయాలి. 24 క్రాప్ట్స్ సమష్టి కృషి సినిమా. అందుకే ఓ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా క్రెడిట్ నా ఒక్క దానికే వస్తుందని నేనెప్పుడూ భావించను. పండిన చెట్టుకే రాళ్లదెబ్బలన్నట్టు ఫేమ్‌లో ఉన్న నాయికల గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకోవడం సహజమే . వాటన్నింటిని పట్టించుకుని తీరిగ్గా బాధపడేటంత సమయం నాకెక్కడిది?'' అని అంటోంది ప్రియమణి.

సోర్స్ : ఆంధ్రజ్యోతి 
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com