Headlines News :
Home » » పవన్ కళ్యాణ్ మాటంటే మాటే ?

పవన్ కళ్యాణ్ మాటంటే మాటే ?


నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది అంటాడు 'గబ్బర్ సింగ్'లో పవన్ కళ్యాణ్. తెరపై విభిన్నశైలిలో వినోదం పంచే పవర్ స్టార్ ఆఫ్ స్క్రీన్ లో అంతర్ముఖుడు. సున్నిత మనస్కుడు. ఆయనది విలక్షణ వ్యక్తిత్వం. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సైలెంటుగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. తన సినిమాల్లో వైవిధ్యం చూపించేందుకు క్షణం క్షణం తపిస్తుంటాడు. అందుకే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చాలా మంది అభిమానిస్తుంటారు. ఆరాధించేవాళ్లూ ఉన్నారు. నిజాయితీకి పవన్ కళ్యాణ్ నిలువెత్తు ఉదాహరణని నిర్మాత బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో ప్రకటించారు. ఇచ్చిన మాట నిలుబెట్టుకోవడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించాడు పవర్ స్టార్. సక్సెస్ వెంట పరుగులు తీసే సినిమా ఇండస్ట్రీలో మాటకు కట్టుబడేవారు తక్కువే. కానీ పవన్ అలా కాదు తను మాట ఇచ్చాడంటే వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఆరునూరైనా మాటకు కట్టు బడతాడు. 'గబ్బర్ సింగ్-2' దర్శకత్వ బాధ్యతలు సంపత్ నందికి అప్పగించడమే దీనికి నిదర్శనం.

'గబ్బర్ సింగ్-2' డైరెక్షన్ ఛాన్స్ ఎవరికీ వస్తుందనే దానిపై తొలుత ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ అవకాశం సంపత్ నందికి దక్కిందనగానే అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్'ను తెరకెక్కించిన హరీష్ శంకర్ కే మళ్లీ ఛాన్స్ ఇస్తారని ఆశించారు. సంపత్ నందికి ఇచ్చిన మాట కోసమే పవన్ కళ్యాణ్ అతడికి అవకాశం ఇచ్చాడు. అతడు చెప్పిన కథ నచ్చక పోయినప్పటికీ సంపత్ కి దర్శకత్వ బాధ్యతలు కట్టబెట్టాడు.

రామ్ చరణ్ తో 'రచ్చ' సినిమా తీసిన సంపత్ నందికి అవకాశమిస్తానని పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశాడు. తర్వాత సంపత్ వినిపించిన స్టోరీ లైన్ పవన్ కు నచ్చింది. దీన్ని డెవలప్ చేసి తీసుకురమ్మన్నాడు. పూర్తిగా కథ తయారయిన తర్వాత పవన్ కు నచ్చలేదట. మరికొన్ని నెలలు కూర్చున్నా పవన్ కు నచ్చే స్క్రిప్ట్ చేయలేకపోయాట. అప్పటికే సంపత్ సంవత్సరం వెచ్చించాడు. అతడి నిబద్దతపై నమ్మకముంచిన పవన్ కళ్యాణ్ అతడికి మరో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అదే 'గబ్బర్ సింగ్-2'. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ స్క్రిప్ట్ సమకూర్చింది. పవన్ మంచి మనసుకు ఇంతకన్నా రుజువేం కావాలి.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com