Headlines News :
Home » » చండీలో అశోక గజపతిరాజుగా కృష్ణంరాజు

చండీలో అశోక గజపతిరాజుగా కృష్ణంరాజు


శక్తిమంతమైన పాత్రలను రక్తికట్టించడంలో కృష్ణంరాజుది ప్రత్యేకమైన శైలి. కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, మచ్చుకు ఈ మూడు సినిమాలు చాలు. ఇలాంటి పాత్రలకు ఆయన ప్రత్యేకత ఏమిటో. త్వరలో ఈ తరహా పాత్రలో రెబల్‌స్టార్ మళ్లీ జూలు విదల్చనున్నారు.

ప్రియమణి ప్రధాన పాత్రలో వి.సముద్ర దర్శకత్వంలో డా.శ్రీనుబాబు.జి నిర్మిస్తున్న ‘చండీ’ చిత్రంలో అశోక గజపతిరాజుగా ఓ పవర్‌ఫుల్ పాత్ర పోషించనున్నారు కృష్ణంరాజు. ఈ పాత్ర గురించి చిత్ర సహ నిర్మాత సత్య ముమ్మడి మాట్లాడుతూ- ‘‘ఇందులో ప్రియమణి తండ్రిగా, ఊరి పెద్దగా, స్వతంత్య్ర సమరయోధుని వారసునిగా కృష్ణంరాజు కనిపిస్తారు.

ఈ పాత్ర కృష్ణంరాజుగారి గత వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. ఇందులోని ఆయన గెటప్, సంభాషణలు, పాత్ర చిత్రణ రెబల్‌స్టార్ అభిమానులకు బాగా నచ్చుతుంది. మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ నెల 17 నుంచి పాట చిత్రీకరణ జరుగుతుంది’’ అని తెలిపారు. ఆశిష్ విద్యార్థి, వినోద్‌కుమార్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి.బాబ్జీ, సంగీతం: ఎస్.ఆర్.శంకర్, చిన్నా, సమర్పణ: జి.జగన్నాథనాయుడు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com