Headlines News :
Home » » జబ్బలు చరిచిన పార్టీల పతనం మొదలైంది : రేవంత్ రెడ్డి

జబ్బలు చరిచిన పార్టీల పతనం మొదలైంది : రేవంత్ రెడ్డి


రాష్ట్రంలో సీట్లన్నీ తమవేనని జబ్బలు చరిచిన పార్టీల పతనం మొదలైందని, తాజా సర్వేలు అవే సూచిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తాజాగా వెల్లడైన సీ ఓటర్ సర్వేను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

'సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని, సంస్ధాగత నిర్మాణం ఉన్న పార్టీలే నిలదొక్కుకోగలవని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. శవాల మీద...సెంటిమెంట్ మీద రాజకీ యం చేసేవారి కాలం చెల్లుతోంది. అక్కడ వైసీపీ తమకు నలభై సీట్లు వస్తాయంటే ఇక్కడ టిఆర్ఎస్ పదిహేను సీట్లు వస్తాయని ప్రచారం చేసుకొన్నాయి. ఉన్న సీట్లు నలభై అయితే తామిద్దరికీ కలిపే ఏభై వస్తాయన్న స్ధాయిలో జబ్బలు చరిచారు. ఏడాది ముందే వాటి పతనం మొదలైంది. ఈ ఏడాదిలో ఇంకా పడిపోవడం ఖాయం. కొద్ది రోజుల్లో ఈ పార్టీలు కనుమరుగు అవుతాయి. పతనం మొదలైందన్నది ఈ సర్వేలు ఒక సంకేతంగా బహిర్గతం చేశాయి. ఆ సర్వేలో వచ్చినంత కూడా ఆ పార్టీల పరిస్ధితి లేదని క్షేత్ర స్ధాయిలో కనిపిస్తోంది' అని ఆయన అన్నారు


సోర్స్ : ఆంధ్రజ్యోతి  
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com