Headlines News :
Home » , » కర్ణాటక ఎన్నికల బరిలో కోటీశ్వరులు

కర్ణాటక ఎన్నికల బరిలో కోటీశ్వరులు


కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. వచ్చే నెల 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలుచేసిన నేతలు తమ ఆస్తులను పేర్కొంటూ అఫిడవిట్లను సమర్పించారు. వీరిలో జేడీఎస్ అభ్యర్థి టీఎన్ జవరాయి గౌడ అందరికంటే అత్యధికంగా రూ.150.58 కోట్ల ఆస్తుల్ని ప్రకటించారు. జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి, ఆయన సతీమణి అనితలు తమ ఉమ్మడి ఆస్తుల విలువను రూ.123 కోట్లుగా పేర్కొన్నారు.

 బళ్లారి జిల్లా విజయ నగర నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రూ.104 కోట్లు, దావణగెరె ఉత్తర నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు శివశంకరప్ప రూ.67 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవి ట్లలో తెలిపారు. మాజీ సీఎం, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తన ఆస్తు ల విలువను రూ.5.96 కోట్లుగా, కేజేపీ మరో నేత హాలప్ప రూ. 3.52 కోట్లుగా పేర్కొన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర రూ.3.87 కోట్లు.

కాంగ్రెస్‌కు చెందిన ఇతర నేతలు కేజీ జార్జ్, బి.బసవరాజు రూ.26.82 కోట్లు, రూ.26 కోట్ల ఆస్తులు ప్రకటించారు. లోకాయుక్త కోర్టులో అవినీతి కేసులు ఎదుర్కొంటున్న పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్ నిరానీ రూ. 28.14 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com