Headlines News :
Home » , » కేసీఆర్, జగన్ మాయలఫకీర్ వారసులు: రాష్ట్ర తెలుగు యువత

కేసీఆర్, జగన్ మాయలఫకీర్ వారసులు: రాష్ట్ర తెలుగు యువత


యువత భవిష్యత్తుకు భరోసా కలిగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర చేస్తుంటే జైలు నుంచి జగన్, ఫాంహౌస్ నుంచి కేసీఆర్ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు డబ్బులు, ప్యాకేజీలు ఎరచూపడం నీచమైన చర్యఅని రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి జిమ్మిబాబు వివమిర్శంచారు. ఉద్యమం ముసుగులో కేసీఆర్, సానుభూతి అడ్డం పెట్టుకుని జగన్ పదేపదే యువతను మోసగించాలిని చూస్తున్నారు.

కేసీఆర్ తన స్వార్ధంతో, ఏకపక్ష పోకడలతో పవిత్రమైన ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాంరంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌కు బలైన కేసీఆర్ గతం మరిచి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ఇతర పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పునీతులుగా చూపించి ప్రజలను వంచించాలని చూడటం అవివేకం.

యువత భవిష్యత్ పట్ల ఆత్మవిశ్వాసం నింపేందుకు 63 సంవత్సరాల వయస్సులోనూ చంద్రబాబు 3 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తుంటే జగన్, కేసీఆర్ యువతను మోసగించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను ఎలా తాకట్టు పెట్టాలి, టిక్కెట్లు ఎలా అమ్ముకోవాలనేవిషయాల్లో ఆరితేరిన జగన్, కేసీఆర్ మాయల ఫకీర్ వారసులుగా మోసం చేస్తున్నారని విద్యార్ధులు, యువత వీరి ప్రలోభాలకు గురికావద్దని జిమ్మిబాబు సూచించారు.


సోర్స్ : ఆంధ్రజ్యోతి 
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com