Headlines News :
Home » , , , » జగన్ ములాఖత్‌లపై విచారణ జరిపించాలి: యనమల

జగన్ ములాఖత్‌లపై విచారణ జరిపించాలి: యనమల


అక్రమాస్తులకేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కడప ఎంపీ జగన్ చంచల్‌గూడ జైల్లో ములాఖత్‌లపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. జైలు సూపరెండెంట్‌తోపాటు ఇతర సిబ్బంది నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

నిందితులకు ములాఖత్‌లు ఇచ్చే ప్రక్రియపై చంచల్ గూడ జైలు సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో విచారణ జరిపించాలని సూచించారు. తక్షణమే విచారణకు ఆదేశించకుంటే జైల్లో ఉన్న జగన్ నిబంధనలకు విరుద్దంగా రాజకీయ కార్యకలాపాలు సాగించేందుకు ప్రభుత్వమే సహకరిస్తోందన్న భావన ప్రజలకు కలుగుతుందని యనమల లేఖలో పేర్కొన్నారు.


సోర్స్ : ఆంధ్రజ్యోతి 
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com