Headlines News :
Home » » జర్నీ-2 ఆడియో విడుదల

జర్నీ-2 ఆడియో విడుదల

గణేష్, మంజరి, మాళ విక హీరో,హీరోయిన్‌గా, శాఖమూరి కృష్ణచైతన్య సమర్పణలో, జయలక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎస్ నారాయణ దర్శకత్వంలో, చిగులూరి గంగాధర చౌదరి నిర్మాతగా నిర్మిస్తున్న జర్నీ-2 చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 30న విడుదలకు సిద్దమైంది. సీనియర్ పాత్రీకేయుడు పసుపులేటి రామారావు ఆడియో సిడిని ఆవిష్కరించి, తొలి సిడిని ప్రముఖ పత్రికాధినేత, నిర్మాత బి ఏ రాజుకు అందించారు. ఈ సందర్బంగా సూపర్ హిట్ పత్రికాధినేత, నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ జర్నీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. కన్నడలో ముంగారుమలై చిత్రంలో నటించిన గణేష్ కన్నడలో నటించిన ముంజా అనే చిత్రాన్ని తెలుగులో ఇప్పుడు జర్నీ-2 అనే పేరుతో సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. కన్నడలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు మాట్లాడుతూ కన్నడలో గణేష్ నటించిన ముంజా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు చిగులూరి గంగాధరరావు చౌదరిగారు తెలుగులో ఆ చిత్రాన్ని జర్నీ2 పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధించి దర్శక నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.సీనియర్ పాత్రికేయులు వినాయకరావు మాట్లాడుతూ గంగాధరరావు చౌదరిగారు మా ఊరుకి చెందినవారే. 

సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన నిర్మాణ రంగంలోకి వచ్చారు. ఆయన నిర్మాతగా వస్తున్న జర్నీ2 కన్నడలో ముంజా అనే పేరుతో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. శాఖమూరి కృష్ణచైతన్య మాట్లాడుతూ "ఇందులో నాలుగుపాటలు ఉన్నాయి . అన్నీ బాగా కుదిరాయి. సినిమాను ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. గణేష్‌కు కన్నడలో పెద్ద మార్కెట్ ఉంది. గణేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. మంజరి తెలుగువారికి బాగా సుపరిచితురాలే. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రం అవుతుంది అన్నారు. నిర్మాత గంగాధరరావు చౌదరి మాట్లాడుతూ "సెప్టెంబర్ 30న విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించి మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉన్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల నాగేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com