Headlines News :
Home » » అక్టోబరు 2 నుంచి చంద్రన్న బీమా పథకం

అక్టోబరు 2 నుంచి చంద్రన్న బీమా పథకం

అక్టోబరు 2న చంద్రన్న బీమా పథకం ప్రారంభం కానుందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతిలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ దీనికి సంబంధించిన ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించబోయే సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంగటిత రంగంలోని 2కోట్ల మందికి చంద్రన్న బీమా పథకం ద్వారా లబ్ది చేకూరు తుందని ఆశాభావ వ్యక్తం చేశారు. చంద్రబాబు, వెంకయ్య నాయుడుపై ఎమ్మెల్యే రోజా అవాకులు, చవాకులు, పేలడం మానుకో వాలని సూచిం చారు. మన్నవరం ప్రాజెక్టు ఎక్కడికీ తరలిపోవడం లేదని, దీనిపై విపక్షాల ఆరోపణలు అర్థరహితమని మంత్రి బొజ్జల విమర్శించారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com