Headlines News :
Home » » అక్టోబర్‌ 7న ఎం.ఎస్‌.జి

అక్టోబర్‌ 7న ఎం.ఎస్‌.జి

మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌(ఎం.ఎస్‌.జి), ఎం.ఎస్‌.జి 2 సినిమా సక్సెస్‌ల తర్వాత గుర్‌మీట్‌ రామ్‌ రహీం సింగ్‌ జీ టైటిల్‌ పాత్రలో రూపొందుతోన్న చిత్రం ఎం.ఎస్‌.జి- ది వారియర్‌ లయన్‌ హార్‌‌ట. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ భాషల్లో సినిమా అక్టోబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.... గుర్‌మీట్‌ రామ్‌ రహీం సింగ్‌ జీ మాట్లాడుతూ - నేను సినిమాల్లో రావడానికి ఎటువంటి ట్రైనింగ్‌ తీసుకోలేదు. యాక్టింగ్‌ చేయడానికి నేరుగా సెట్‌కు వచ్చేసేవాడిని. షాట్‌ పూర్తి కాగానే ఆర్‌‌ట డైరెక్షన్‌, మ్యూజిక్‌ అన్నీ విభాగాల్లో నేను పార్టిసిపేట్‌ చేసేవాడిని. ఇది సాధారణ వ్యక్తి వల్ల అయ్యే పనికాదు. కానీ నేను ఐదేళ్ళ వయసు నుండి గురు మంత్రం చేస్తుండటం వల్ల నాకు ఇవన్నీ సాధ్యమయ్యాయి. 2010లో విరాట్‌ కోహ్లి, నెహ్రా, శిఖర్‌ ధావన్‌, అమిత్‌ మిశ్రా సహా కొంత మంది ఆటగాళ్లు నన్ను కలిసి మేం 30-40 పరుగులు చేసిన తర్వాత అవుట్‌ అయిపోతున్నానని, ఏం చేయాలో చెప్పమని సలహా అడిగారు. నేను కొన్ని సలహాలు చెప్పడంతో తను ఆట మెరుగయ్యింది. తను ఇప్పుడు ఇండియన్‌ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది అన్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com