Headlines News :
Home » » అఖిల పక్షం ఐక్యతారాగం

అఖిల పక్షం ఐక్యతారాగం

నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేసిన లక్షిత దాడులను అఖిలపక్షం సమర్థించింది.అలాగే ఉగ్రవాదానికి పరోక్ష మద్దతిస్తూ కుటిల నీతికి పాల్పడే పాకిస్థాన్‌కు జవాన్లు బుద్ధి చెప్పారంటూ యావత్‌ భారతజాతి కొనియాడుతోంది. కాగా ఏ అంశంపై అయినా నిప్పు- ఉప్పులా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలు సైనిక దాడిపై మాత్రం ఒక్కటై ఆర్మీని అభినందనల్లో ముంచెత్తాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పాక్‌పై భారతఆర్మీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నిర్వహించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలను హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ పార్టీ నేతలకు వివరించారు. తదుపరి కార్యాచరణ గురించి ఈ భేటీలో చర్చించారు. ఎల్‌ఓసీలో సైన్యం చేపట్టిన లక్షిత దాడులను అన్నిపక్షాలు ఏకగొంతుగా సమర్థించాయి.

ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం భారత్‌కు పొంచివున్న ఉగ్రవాద ముప్పు, సైన్యం చేపట్టిన లక్షిత దాడులపై రాజ్‌నాథ్‌ అఖిలపక్ష నేతలకు వివరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ చేపట్టిన లక్షిత దాడులను అన్ని పార్టీల నేతలు సమర్థించారు. కాగా సైన్యం చేపట్టిన చర్యలు అభినందనీయంమని జాతీయ నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం, సైన్యం తీసుకునే చర్యలకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ మద్దతిస్తుందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. కాగా ఈ సమావేశానికి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి వెంకయ్యనాయుడు,

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌, ఎల్జీపీ అధినేత రాం విలాస్‌ పాశ్వాన్‌ , సీపీఎం నేత సీతారాం ఏచూరీ, ఎన్సీపీ చీఫ్‌ శరత్‌ పవార్‌ బీఎస్సీ నేత సతీష్‌ మిశ్రా, ఆర్జేజీ ప్రతినిధి ప్రేమ్‌ చంద్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయ ప్రిన్స్‌ పల్‌ సెక్రటరీ న్రిపేంద్ర సింగ్‌ సహా పలువురు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలతో పాటు బెంగాల్‌, ఒడిషా, పంజాబ్‌ , బీహార్‌ రాష్ట్రాలకు చెందిన సీఎంలను ఫోన్‌ చేసి దాడి పరిణమాల గురించి వివరించారు. కాగా ఇండో పాక్‌ సరికాహద్దు ప్రాంతంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com