Headlines News :
Home » » న‌యీం గురించి వ‌ర్మ చెప్పిన సీక్రెట్‌

న‌యీం గురించి వ‌ర్మ చెప్పిన సీక్రెట్‌

న‌యీం గురించి వ‌ర్మ చెప్పిన సీక్రెట్‌
నేను రౌడీల‌కే రౌడీ.. డాన్‌ల‌కే డాన్‌.. విల‌న్ల‌కే విల‌న్ అంటుంటాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న సంగ‌తి తెలియ‌క ఇప్పుడు గ్యాంగ్ స్ట‌ర్ న‌యీముద్దీన్‌ అనుచ‌రులు ఆయ‌న్ని బెదిరిస్తున్నార‌ట‌. న‌యీం ఎన్‌కౌంట‌ర్ అయిన కొన్ని రోజుల్లోనే అత‌డి మీద సినిమా తీయ‌బోతున్నాన‌ని.. అది మూడు భాగాలుగా ఉంటుంద‌ని వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే న‌యీం సినిమా టైటిల్ లోగో త‌యారు చేయించ‌డంతో పాటు లేటెస్టుగా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. ఐతే ఈ సినిమా తీస్తాన‌న్నందుకు త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు వ‌ర్మ తాజాగా వెల్ల‌డించాడు. దీంతో పాటు న‌యీం గురించి స‌మాచారం తెలుసుకునే క్ర‌మంలో త‌న‌కు తెలిసిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా వ‌ర్మ ట్విట్ట‌ర్లో పంచుకున్నాడు.

‘‘నాకు న‌యీం గ్రూప్ నుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. కానీ నేను నయీంల‌కు నయీమ్ అని వాళ్లు తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం నేను ముంబ‌యిలో ఉన్నా. న‌యీంతో కలిసి జైల్లో గ‌డిపిన వ్య‌క్తిని క‌లిశాను. న‌యీంతో స‌న్నిహిత సంబంధాలున్న ఐదుగురు పోలీసుల్ని.. అత‌డితో క‌లిసి మూడేళ్లు ప‌ని చేసిన ఇద్ద‌రు నక్స‌లైట్ల‌ను కూడా క‌లిశాను. నేర ప్ర‌పంచం గురించి నాకున్న మొత్తం అవ‌గాహ‌న ప్ర‌కారం చూస్తే క‌రాచిలో ఉన్న వ్య‌క్తితో న‌యీం చాలా చాలా క్లోజ్ అని తెలిసి నిజంగా ఆశ్చర్య‌పోయా’’ అని వ‌ర్మ అన్నాడు. ఇక్క‌డ‌ వ‌ర్మ చెబుతున్న క‌రాచి వ్య‌క్తి దావూద్ ఇబ్ర‌హీం అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదేమో.






telugu.gulte.com




Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com