Headlines News :
Home » » ముంపు ప్రాంతాల్లో చ‌ంద్ర‌బాబు ఏరియల్ సర్వే

ముంపు ప్రాంతాల్లో చ‌ంద్ర‌బాబు ఏరియల్ సర్వే

గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకుముందు తన నివాసం నుంచి ఆ జిల్లాకు చెందిన అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. వరద నీటి కారణంగా ముంపునకు గురైన గురజాల, మాచర్ల, న‌ర‌స‌రావుపేట‌, పెదకూరపాడు తదితర ప్రాంతాల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో సర్పంచి నుంచి గ్రామ‌ కార్యదర్శులందరితోనూ ఒకే సారి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పునరావాసం, సహాయ చర్యలు సకాలంలో అందితేనే ప్రజలకు సంతృప్తి కలుగుతుందని వ్యాఖ్యానించారు. భారీ వర్షాలలో నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించాలని స్పష్టం చేశారు. వరద సాయం రాలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠినంగా వ్యవహరిస్తానని సీఎం హెచ్చరించారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com