Headlines News :
Home » » ఆ నలుగురు అందాల తారల కలయికలో...

ఆ నలుగురు అందాల తారల కలయికలో...

1980, 90ల్లో సినీ ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపిన నిన్నటితరం అందాలతారలు వెండితెరపై మళ్లీ సందడి చేయబోతున్నారు. సినీ ఫంక్షన్లలో, ప్రైవేటు కార్యక్రమాల్లో మాత్రమే ఒక్కటిగా కనిపించే ఆ నలుగురు ఒకే చిత్రంలో కలిసి నటించనుండడం విశేషం. సంగీత దర్శకుడు జేమ్స్‌ వసంతన ఈ అరుదైన కలయికకు శ్రీకారం చుట్టారు. ‘వానవిల్‌ వాళ్కై’ చిత్రంతో దర్శకుడిగా మారిన జేమ్స్‌వసంత మరో కొద్ది రోజుల్లో రెండో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం ఆస్ర్టేలియాలోనే జరుపనున్నారు. స్ర్తీ ప్రాధాన్య కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుహాసిని, ఊర్వశి, రాధిక, ఖుష్బూలను నటింపజేయాలని జేమ్స్‌ వసంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, కథ నచ్చడంతో ఆ నలుగురు తారలూ కలిసి నటించేందుకు అంగీకరించారని సమాచారం.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com