Headlines News :
Home » » జగన్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేరుుంచాలి

జగన్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేరుుంచాలి

సాక్షి అవినీతి మీడియా అని సీబీఐ విచారణలో తేలిందని, అందువల్లే సాక్షి ఆస్తులను అటాచ్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడించారు. విదేశాలలో ఉన్న తెలుగువారిని వైసీపీ నేత జగన్ తన రాజకీయాల కోసం చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలతో హోదా వస్తే క్షణంలో రాజీనామ చేస్తామని గతంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హోదా కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రెఫరెండం కావాలంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఎన్నికలకు ముందుకు రావాలని, ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని ముద్దుకృష్ణమనాయుడు జగన్‌కు సవాల్ విసిరారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com