Headlines News :
Home » » కుమార్తె కోసం మొసలిలా మారిపోయిన స్టార్ హీరో

కుమార్తె కోసం మొసలిలా మారిపోయిన స్టార్ హీరో

కుమార్తె కోసం మొసలిలా మారిపోయాడో స్టార్ హీరో. బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా పేరున్న అక్షయ్ కుమార్ తన కూతురి కోసం ఏమైనా చేస్తానని నిరూపించారు. తన కూతురు నిటారాకు నాలుగేళ్లు నిండిన సందర్భంగా పుట్టినరోజును ఘనంగా చేశారు. చిన్న పిల్లల ముందు మామూలు తండ్రి అయినా, స్టార్ హీరో అయినా ఒకటే. పిల్లలను ఆడించడం కోసం అవసరమైతే గుర్రంలా మారిపోవాలి. ఏనుగులాగా కూడా మారి వీపుపై ఎక్కించుకుని తిప్పాలి.

హీరో అక్షయ్ కుమార్ కూడా అలాగే చేశారు. పుట్టిన రోజునాడు కూతురి ముచ్చట తీర్చడం కోసం స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు మొసలిలా మారిపోయారు. కూతుర్ని వీపుపై ఎక్కించుకుని మినీ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టారు. అంతేకాకుండా కూమార్తె చేతిలో విదూషకుడిలా కూడా మారిపోయారు. బర్త్ డే సందర్భంగా వచ్చిన గిఫ్టుల్లో కొన్నింటిని తీసుకొని వాటితో అక్షయ్ కుమార్‌ను విదూషకుడిలా మార్చేసి చిరునవ్వులు చిందిస్తూ నిటారా తెగ ఆనందపడిందట. కుమార్తె అంతగా చిరునవ్వు చిందిస్తుంటే తండ్రికి కూడా పట్టరాని సంతోషం కలిగిందంట. కూతురి కళ్లలో సంతోషం కోసం ఏమైనా చేసే అక్షయ్‌కుమార్‌ను అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు.


అక్షయ్ మొసలలిలా మారిపోయిన ఫొటోను ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా పోస్ట్ చేయగా, తన కూతురు విదూషకుడిగా మార్చేసిన ఫొటోను ఆయనే ట్వీట్ చేశారు.







andhrajyothy
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com