Headlines News :
Home » » ఆమెను భరించడం కష్టమే!

ఆమెను భరించడం కష్టమే!

సిల్వర్ స్క్రీన్‌పై అతి కొద్దికాలంలో తారాపథానికి దూసుకెళ్లిన ముద్దుగుమ్మ రెజీనా టాలీవుడ్ లో అగ్రతారగా కొనసాగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలతో ఛాన్స్‌లు కొట్టేస్తున్న ఈ అమ్మడు తెగ బిజీగా మారిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరోస్ నారా రోహిత్ - నాగ శౌర్యలతో కలిసి రెజీనా కలిసి నటించిన జ్యో అచ్యుతానంద ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవు తోంది. ఈ క్రమంలో సదరు చిత్రం హీరోలు మీడియాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రెజీనాపై నాగశౌర్య ఆసక్తికర కామెంట్లు చేశాడు. అంతేకాదండోయ్ అతడు చేసిన కామెంట్లకు నారా రోహిత్ కూడా మద్దతు పలికాడు. అయినా రెజీనా గురించి నాగశౌర్య ఏమన్నాడంటే... రెజీనాను భరించడం రీల్ లైఫ్‌లో అయితే ఓకే కానీ - రియల్ లైఫ్‌లో మాత్రం అసాధ్యమని అతడు చెప్పాడు. రెజీనా చాలా ఇంటెలిజెంట్ అని ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించినా సరేనంటానని పేర్కొన్నాడు. నాకైతే మాత్రం జ్యో అచ్యుతానంద చిత్రంలోని రెజీనా కారెక్టర్ లాంటి అమ్మాయి మాత్రం తనకు వద్దని అతడు చెప్పాడు. 

ఇక చిత్రంలో తనకు సోదరుడిగా నటించిన నారా రోహిత్ కు కూడా రెజీనా లాంటి అమ్మాయి వద్దని కూడా అతడు చెప్పాడు. నాగశౌర్య మాటలకు మద్దతు పలికిన నారా రోహిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇక తనకు కాలేజీ లైఫ్ లో జ్యో లాంటి అమ్మాయి తగిలిందా అని చాలా మంది అడుగుతున్నారని అయితే తనకు మాత్రం అలాంటి అమ్మాయి మాత్రం తగలలేదని నాగశౌర్య చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.






suryaa.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com