Headlines News :
Home » » ‘బాహుబలి’ కష్టాలు ఇక చెల్లు!

‘బాహుబలి’ కష్టాలు ఇక చెల్లు!

కుడుముసారి వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన పాంగి సత్తెబాబు అనారోగ్యంతో బాధపడుతున్న తన ఏడాది కుమార్తెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బాబాయి సహాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న చిత్రాలు బుధవారం దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి ,ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా 'బాహుబలి..బతుకు బలి' అనే శీర్షికతో ప్రచురణమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... జిల్లా కలెక్టర్‌, పాడేరు ఇన్‌చార్జి పీవోతో మాట్లాడారు. కుడుముసారి పంచాయతీకి చెందిన 12 గ్రామాల ఆదివాసీల ఇబ్బందులు తీర్చే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈమేరకు రూ.రెండు కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ముఖ్యమంత్రికి పంపించారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com