Headlines News :
Home » » వణుకు పుట్టిస్తున్న నయిం 'ఫోటో' స్కెచ్‌

వణుకు పుట్టిస్తున్న నయిం 'ఫోటో' స్కెచ్‌

వణుకు పుట్టిస్తున్న నయిం 'ఫోటో' స్కెచ్‌
''పోయినోడు పోకుండా మా ప్రాణాలు పోయేలా చేస్తున్నాడే'' అన్నట్లుగా మారింది నయింతో అంటకాగిన అధికారులు.. నేతల పరిస్థితి. నయిం ఎన్‌ కౌంటర్‌ జరిగి ఇన్ని రోజులైనా.. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతలు.. అధికారుల పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడే పరిస్థితి. నయింతో గుట్టుగా ఎంతోమంది.. బాహాటంగా మరికొంతమంది సంబంధాలు పెట్టుకోవటం తెలిసిందే.

అయితే.. వారిలో ఎవరూ ఊహించనంత క్రిమినల్‌ మైండ్‌ నయింలో ఉన్న విషయం అతగాడి ఎన్‌ కౌంటర్‌ అయ్యాక కానీ అందరికి అర్థం కాలేదు. అతడితో పరిచయం ఉన్నోళ్లు సైతం.. నయిం ఎన్‌ కౌంటర్‌ తర్వాత అతగాడి నేర చరిత్ర గురించి మీడియాలో చూసి షాక్‌ తింటున్నారట. ఇలాంటి నరరూప రాక్షసుడితో మనం డీల్‌ చేశామా? అని ఫీలైనోళ్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. నయిం ఎన్‌ కౌంటర్‌ తర్వాత అతడితో సంబంధాలు ఉన్న వారికి సంబంధించిన సమాచారాన్ని విచారణ అధికారులు లాగినట్లుగా చెబుతున్నారు. నయింకు సంబంధించిన డైరీలతోపాటు.. ఇటీవల అతగాడి డెన్‌ లో మూడు బస్తాల మేర ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు.

తనతో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్క రాజకీయనేత.. అధికారుల ఫోటోల్ని నయిం తీసుకొని జాగ్రత్తగా భద్రపర్చినట్లుగా కనిపిస్తోంది. తొలుత తనతో మంచిగా ఉండి.. తర్వాతి కాలంలో తేడా వస్తే.. ఉపయోగించుకోవటానికి వీలుగా ఈ ఫోటోల ఉంటాయన్న ఆలోచన గా భావిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన ఇంటి దగ్గరో.. తన అడ్డా దగ్గరో వచ్చిన వారందరి ఫోటోలు తీసిన నయిం.. చివరకు తనతో సంబంధం ఉన్న నేతలు.. అధికారుల ఇళ్లకు వెళ్లిన సందర్భంలోనూ వారికి తెలీకుండా ఫోటోలు తీసుకొని భద్రపరిచిన వైనం చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇలా సేకరించిన ఫోటోలు మొత్తం కలిపితే మూడు బస్తాల మేర ఉంటాయని.. నయింతో సంబంధాలు ఉన్నాయని చెప్పటానికి ఈ ఆధారం ఒక్కటి సరిపోతుందన్న మాట అధికారిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సమాచారం బయటకు వచ్చిన నాటి నుంచి నయింతో అంటకాగిన వారికి నిద్ర లేకుండా పోతుందని చెబుతున్నారు. చేసిన పాపం అంత తొందరగా పోదు కదా..?







telugu.gulte.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com