Headlines News :
Home » » స్టేలతో కాలం గడుపుతున్న బాబు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ

స్టేలతో కాలం గడుపుతున్న బాబు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేలతో కాలం గడుపు తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో ఆయన స్టే తెచ్చున్నారని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులోనూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే 4 వారాల్లో తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారని చంద్ర బాబును ఆయన ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హాండెడ్‌గా దొరికిపోయారన్నారు. బ్లాక్‌మనీతో తెలం గాణ ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ ముమ్మాటికీ చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు. అది తన వాయిస్ కాదని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓటు కు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.



suryaa.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com