Headlines News :
Home » » అమ్మాయికి మత్తు ఇచ్చి...అశ్లీల వీడియో చిత్రీకరించి...ఆపై బ్లాక్‌మెయిలింగ్

అమ్మాయికి మత్తు ఇచ్చి...అశ్లీల వీడియో చిత్రీకరించి...ఆపై బ్లాక్‌మెయిలింగ్

పొరుగింటికి వచ్చిన అమ్మాయికి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి...ఆమె మత్తులోకి జారుకున్నాక అభ్యంతరకరమైన చిత్రాలు, వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసిన యువకుడికి పోలీసులు అరదండాలు వేసిన ఘటన ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో జరిగింది. ఫరీదాబాద్ కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి తన పొరుగున ఉన్న గితూ ఇంటికి వెళ్లి రాత్రంతా ఉంది. ఇంటికి వచ్చిన పొరుగింటి అమ్మాయికి మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. అంతే ఆ జ్యూస్ తాగిన అమ్మాయి నిద్రలోకి జారుకుంది. ఇదే అదనుగా చూసిన ఆ ఇంటి యజమాని సోదరుడు ప్రవేష్ అమ్మాయి నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. మరునాడు అమ్మాయికి మెలకువ రాగానే ఇంటి నుంచి నగలు, డబ్బు తీసుకొని వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే నగ్న చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తానని ప్రవేష్ బ్లాక్ మెయిలింగ్ చేశాడు. దీంతో భయపడిన అమ్మాయి ప్రవేష్ కు కొంత డబ్బు ఇచ్చింది. అయినా ప్రవేష్ బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తుండటంతో విసిగిపోయిన అమ్మాయి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com