Headlines News :
Home » » హీరోకి తగ్గ అభిమానులనిపించుకున్నారు !

హీరోకి తగ్గ అభిమానులనిపించుకున్నారు !

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అభిమాని రామచంద్రపురం మండలం వెల్లసావరానికి చెందిన కురసాల సుబ్రహ్మణ్యానికి పవన్‌కల్యాణ్‌ అభిమానులు రూ.20వేల ఆర్థిక సాయం అందించారు. కాకినాడలో పవన్‌ నిర్వహించిన ఆత్మగౌరవసభలో చెట్లు కొమ్మమీద పడి నుంచి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక, కాళ్లకు శస్త్రచికిత్స జరిగింది. కాకినాడ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సుబ్రహ్మణ్యానికి ద్రాక్షారామ, తోటపేటకు చెందిన అభిమానులు చోడిశెట్టి శివాజీ, మేర్నీడి శ్రీను, ముప్పనపల్లి గణేష్‌, సలాది శ్రీను, వంగరాజులు రూ.20వేలు ఆదివారం వెల్లసావరంలో అందచేశారు. త్వరగా కోలుకోవాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ABN
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com