Headlines News :
Home » » సినిమాల ప్రభావంతో ఏం చేశారో చూడండి

సినిమాల ప్రభావంతో ఏం చేశారో చూడండి

నకిలీ పూజారులుగా అవతారమెత్తి..ప్రజలను నిండా మోసగిస్తున్న ఇద్దరు నకిలీ పూజారులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని పామిడికి చెందిన జయన్న, అతడి బామరిది కుళ్లాయప్ప విలాసాలకు అలవాటుపడి కొద్దిరోజుల కిందట నకిలీ పూజారులుగా అవతారమెత్తారు. వీరిద్దరూ పదిరోజులుగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ..ఇళ్లకు వాస్తు సరిచేసి దిష్టి తీస్తామంటూ జనాలను నమ్మించి వారినుంచి రూ.వేలల్లో నగదు వసూలు చేస్తున్నారు. ఇదంతా మోసమని గుర్తించిన పట్టణవాసులు ఆదివారం నకిలీ పూజారులను పట్టుకుని స్థానిక పెట్రోల్‌బంక్‌ వద్ద దేహశుద్ధి చేశారు. అనంతరం వన్‌ టౌన్ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సినిమాల ప్రభావంతోనే ఈ వేషం కట్టి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది.






andhrajyothy
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com