Headlines News :
Home » » నాతో చనువుగా ఉంది.. సడెన్‌గా వదిలేసింది ఆ ఒక్క హీరోనే!

నాతో చనువుగా ఉంది.. సడెన్‌గా వదిలేసింది ఆ ఒక్క హీరోనే!

ఈ మధ్య కాలంలో కాస్త వెనక్కు తగ్గినా.. కాజల్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతోంది. జనతా గ్యారేజ్‌లో ఐటం సాంగ్ హిట్టవ్వడం, మెగాస్టార్ 150వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికవడం కాజల్ హవాకు అద్దం పడతాయి. ఈ సందర్భంలో తన సినీ కెరీర్‌లో తనను బాగా ఉపయోగించుకున్న ఒక హీరో.. సడెన్‌గా వదిలేశాడని తన స్నేహితుల వద్ద వాపోయిందట. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు షాహిద్ కపూర్‌తో ఒక సినిమాకు ఎంపికయ్యింది. అయితే, సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. ఈ చనువుతో తనకు ఉన్న లగ్జరీ కారును షాహిద్ విపరీతంగా వాడేసుకున్నాడని, చివరికి సినిమా ఆగిపోవడంతో సడెన్‌గా మాట్లాడ్డం మానేశాడని, కనీసం ఫోన్ కూడా చేయడం మానేశాడని చెప్పుకొచ్చిందట. తనతో చనువుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి, ఇలా సడెన్‌గా మాట్లాడడం మానేసిన ఒకే ఒక వ్యక్తి కూడా షాహిదే అని చెప్పిందట. ఇప్పుడు బాలీవుడ్‌ జనాలు దీని గురించి ఒకటే గుసగుసలాడుతున్నారు.






ABN
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com