Headlines News :
Home » » గాలిలో నుంచి దిగిరా బాబు

గాలిలో నుంచి దిగిరా బాబు

రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు విమా నాల్లో తిరుగుతూ ఆకాశంలో చక్కెర్లు కొడుతున్నారనిన్నారని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ఆకా శం నుంచి చంద్రబాబు భూమికి దిగి రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాల న్నారు. ఇక కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వచ్చే నాథుడు కూడా లేడని, కనీసం అధికారి కూడా గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చా రు.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సోమవారం నాడు గుంటూరు జిల్లా ముత్యాలంపాడులో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వరుసగా పడుతున్న వర్షాల వల్ల పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వర్షాలు, వరదలతో రైతుల దారుణంగా దెబ్బతింటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పైపైన పరిశీలించి వెళ్లిపోయారన్నారు. 

జూలై చివరి నుంచి ఆగస్ట్ చివర వరకూ వర్షాలు పడలేదని, అప్పుడు చచ్చిచెడీ రైతులు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈ రెండు నెలలు వర్షాలు ముంచెత్తాయన్నారు. చేతికి వస్తుందనుకున్న పంట చివరికి వరుణుడి పాలైందన్నారు. గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇంతవరకూ రైతులకు అందలేదన్నారు. రైతుకు రూపాయి చేతికి అందలేదని వైఎస్ జగన్ అన్నారు. ఓ పక్క రుణాలు మాఫీ కాక, మరోవైపు కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే మంజూరు కానీ పరిస్థితి నెలకొందన్నారు.

 పైగా బంగారంపై రుణాలు ఇవ్వొద్దని చంద్రబాబే చెబుతున్నారని ఆక్షేపించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రెండు, మూడు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చినా పంట చేతికందని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాకు 120 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందని జగన్ అన్నారు. నష్ట పోయిన పంట పొలాలను నేరుగా వచ్చి పరిశీలించి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు అండగా నిలవాలన్నారు.





suryaa.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com