Headlines News :
Home » » సినిమా రేంజ్‌లో రూ.1.18 కోట్లు కొట్టేశాడు

సినిమా రేంజ్‌లో రూ.1.18 కోట్లు కొట్టేశాడు

అంబత్తూర్‌ నియోజకవర్గ పరిధిలోని వేలంప్పన్‌చావిడి ఏటీఎంకు తరలిస్తున్న రూ.1.18 కోట్లతో పరారైన వ్యాన్ డ్రైవర్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వేలప్పన్‌చావిడిలో ఓ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంకు రూ.1.18 కోట్ల నగదును తరలిస్తున్న వ్యాన్‌ను ఇసైకిముత్తు నడుపుతున్నాడు. వ్యాన్‌లో సెక్యూరిటీగా జోయల్‌ కూడా ఉన్నారు. ఆ వ్యాన్ అంబత్తూర్‌ సమీపంలోని పులియంపట్టి ప్రాంతానికి చేరుకున్న సమయంలో టీ తాగేందుకు ఇసైకిముత్తు నిలిపిన సమయంలో సెక్యూరిటీగా ఉన్న జోయల్‌ టాయ్‌లెట్‌కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఇసైకిముత్తు నగదు ఉన్న వ్యానం‌తో సహా ఉడాయించాడు. దీనిపై జోయల్‌ అందించిన ఫిర్యాదును నమోదుచేసుకున్న అంబత్తూర్‌ ఏఎస్పీ సుధాకర్‌ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలను చేపట్టారు.

andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com