Headlines News :
Home » » ఇలాగైతే పరిశ్రమలు ఎలా వస్తాయి?: రఘువీరా

ఇలాగైతే పరిశ్రమలు ఎలా వస్తాయి?: రఘువీరా

రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఇలాగైతే కొత్త పరిశ్రమలు ఏవిధంగా వస్తాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ప్రశ్నించారు. సోమవారం ఇందిరభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఐదేళ్లలోపు స్థాపించుకునే పరిశ్రమలకు 15 శాతం అదనపు తరుగుదల, 15 శాతం పెట్టుబడి అలవెన్స్‌లతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్ (సీబీడీటీ) సర్క్యులర్ జారీ చేయడం దారుణమన్నారు. శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు టైస్టులా, సైకోలా తయారయ్యారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పేరుతో విద్యార్థులు ఉద్యమాల్లో పాల్గొన్నా, రైతులు వారికి రావాల్సిన పరిహారం కోసం దీక్షలు చేసినా పీడీ యాక్టు నమోదు చేస్తామంటూ బెదిరించడం దుర్మార్గమన్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com