Headlines News :
Home » » పరిశుభ్రతలో ఏపీ చర్యలు భేష్‌

పరిశుభ్రతలో ఏపీ చర్యలు భేష్‌

బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ నిలవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. స్వచ్ఛభారత్‌పై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆదివాచం ఆయన రెండు స్టాంపులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌పై ఆంధ్రప్రదేశ్‌ తీసుకుంటున్న చర్యలకు ప్రోత్సాహకంగా రూ. 186 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా గుజ రాత్‌లో 170, ఏపీలో 110 మున్సిపాలిటీలు పరిశుభ్రతలో స్ఫూర్తి చూపా యని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛాగ్రహిగా మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్రం పిలుపుతో తెలంగాణ రాష్ట్రం కూడా పరిశుభ్రత అమలు చేస్తోందని అభినందించారు. గుజరాత్‌లోని పోరు బందర్‌ జిల్లాను పూర్తిస్థాయి పరిశుభ్రత సాధించిన జిల్లాగా ప్రకటించినట్లు తెలిపారు. పరిశుభ్రత విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలు పోటీ పడాలని వెంకయ్య నాయుడు సూచించారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com