Headlines News :
Home » » బాలయ్యతో చిరు ఢీ!

బాలయ్యతో చిరు ఢీ!

మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ రియల్‌ లైఫ్‌లో మంచి స్నేహితులే అయినా.. రీల్‌ లైఫ్‌లోనూ, పొలిటికల్‌ లైఫ్‌లోనూ మాత్రం ప్రత్యర్థులే. కొంతకాలంగా రాజకీయాల్లో సైలెంట్‌ అయిన చిరంజీవి తన 150వ సినిమా పనిలో బిజీగా ఉండగా, బాలయ్య తన వందో సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు వచ్చే సంక్రాంతి బరిలో దిగనున్నారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’, బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నాయి.

‘‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రం షూటింగ్‌ దాదాపు 70 శాతం పూర్తయింది. నాన్నగారు డబ్బింగ్‌ కూడా చెప్పేశారు. ఇప్పటివరకు మంచి ఔట్‌పుట్‌ వచ్చింది. అన్ని పనులూ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేస్తున్నామ’ని నిర్మాత రామ్‌చరణ్‌ ప్రకటించాడు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

ఇక, తాము సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్టు ‘గౌతమిపుత్ర..’ యూనిట్‌ ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికే నైజాం, సీడెడ్‌ అమ్మకాలు కూడా పూర్తయినట్టు వార్తలు వచ్చేశాయి. ఏదేమైనా చిరు, బాలయ్యల చిత్రాలు ఒకేసారి సంక్రాంతి బరిలో పోటీపడి చాలాకాలమైంది.






andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com