Headlines News :
Home » » భర్తను విలన్‌గా మార్చుకున్న సిమ్రాన్?

భర్తను విలన్‌గా మార్చుకున్న సిమ్రాన్?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేసిన ఆ అందాల భామ... ఇప్పుడు తన భర్తను విలన్‌గా మార్చేసిందట. ఇందుకోసం అమ్మడు బాగానే కష్టపడిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.....

ఒకప్పుడు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన సిమ్రాన్... ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆ మధ్య కొత్తవాళ్లతో సినిమాలు రూపొందిస్తానని ప్రకటించిన ఈ వెటరన్ బ్యూటీ... తక్కువ బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుతం ఖాళీగా ఉన్న తన భర్తను నటుడిగా మార్చేందుకు సిమ్రాన్ ప్రయత్నాలు చేస్తోందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

గతంలో ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం చేసిన సిమ్రాన్ భర్త దీపక్ బగ్గా... కొంతకాలంగా సిమ్రాన్‌తో కలిసి మూవీ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం సిమ్రాన్‌ను కలిసిన కొందరు దర్శకనిర్మాతలు... మీ భర్తకు యాక్టర్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, సినిమాల్లో ట్రై చేయొచ్చని సలహా ఇచ్చారట. దీంతో అప్పటి నుంచి భర్తను నటుడిగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సిమ్రాన్ ఫైనల్‌గా దీపక్‌ను విలన్‌గా మార్చేసింది.

కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'ఓడు రాజా ఓడు' సినిమాలో విలన్ రోల్ కోసం సిమ్రాన్ భర్తను ఎంపిక చేశారట దర్శకనిర్మాతలు. ఒకవేళ ఈ సినిమాతో దీపక్ బగ్గాకు బ్రేక్ వస్తే... అతడికి తన పలుకుబడితో మరిన్ని అవకాశాలు ఇప్పించాలని చూస్తోందట ఈ వెటరన్ బ్యూటీ. మొత్తానికి పైలెట్‌ను పెళ్లి చేసుకున్న ఒకప్పటి అందాల భామ అతడిని విలన్‌గా మార్చేందుకు బాగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియాలంటే 'ఓడు రాజా ఓడు' సినిమా రిలీజయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.






andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com