Headlines News :
Home » » చిక్కుల్లో కోడిరామకృష్ణ నాగభరణం సినిమా

చిక్కుల్లో కోడిరామకృష్ణ నాగభరణం సినిమా

‘అమ్మోరు’, ‘అరుంధతి’ చిత్రాల సృష్టికర్త తెలుగు దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ తెరకెక్కించిన మరో విజువల్‌ వండర్‌ దేవతా చిత్రం ‘శివనాగం’. కన్నడంలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే 14వ తేదీన ‘శివనాగం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దేవతా చిత్రాలకు దక్షిణాది భాషల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.

అయితే కావేరీ జలాల వ్యవహారంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య చిచ్చు రేగడంతో ‘శివనాగం’ విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. ప్రభుత్వాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కన్నడ తారలు జోక్యం చేసు కోవడంపై తమి ళ ప్రజలు ఆగ్ర హం ఉన్న నేప థ్యంలో ‘శివనాగం’ తమిళంలో విడుదల కావడం సందేహమే అంటున్నారు. అందు లోనూ ఇతర భాషా చిత్రాలను కన్నడంలో డబ్బింగ్‌ చేయకూడదని కన్నడ సినీపరిశ్రమ ఇదివరకే ఒక తీర్మానం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడంలో ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలి.









andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com