Headlines News :
Home » » చిరంజీవితో మాట్లాడినా.. మాట్లాడకపోయినా..!

చిరంజీవితో మాట్లాడినా.. మాట్లాడకపోయినా..!

ముక్కుసూటిగా మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకునే పోసాని కృష్ణమురళి మెగాస్టార్‌ చిరంజీవిపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఆయనలో తనకు నచ్చే క్వాలిటీ గురించి వివరించారు. ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్ర యూనిట్‌ పోసానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

‘చిరంజీవితో మనం ఎన్ని సంవత్సరాలైనా కలసి ప్రయాణం చెయ్యొచ్చు. ఆయనలో నాకు నచ్చేది ఏంటంటే.. మీరు చిరంజీవితో మాట్లాడండి.. మాట్లాడకపొండి.. మనం ఆయనకు నమస్కారం పెట్టామంటే చాలు.. తిరగి అంతే గౌరవంతో మనల్ని విష్‌ చేస్తారు. మానవతా దృక్పథంలో ఆయన నిజంగా చిరంజీవే. ఆయన 150వ సినిమా నేరుగా 150 రోజులు ఆడాలని కోరుకుంటున్నాన’న్నారు. ఇక, వినాయక్‌ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఆయనో జెంటిల్‌మన్‌ అని చెప్పారు. ‘ధృవ’ చిత్రంలో కూడా తనకు ఓ మంచి పాత్ర దక్కిందని, చిరు కుటంబంతో తన ప్రయాణం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.













andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com