Headlines News :
Home » » మరుగుదొడ్డి లేకుంటే పోటీకి అనర్హులే

మరుగుదొడ్డి లేకుంటే పోటీకి అనర్హులే

ఇంట్లో మరుగుదొడ్డి లేని నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తామని సీఎం ఎన్.చంద్రబాబు ప్రకటించారు. దీనిపై త్వరలో చట్టం చేయనున్నామని తెలిపారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రత్యేక సభను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 1,000 పంచాయతీలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్)ప్రాంతాలుగా ప్రకటించారు. 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్రం ఓడీఎఫ్ ప్రాంతంగా గుర్తింపు పొందాలని, దీనికి అధికార యంత్రాంగం శ్రమించాలని సూచించారు.వెయ్యిమంది సర్పంచులకు ఓడీఎఫ్ సర్టిఫికెట్లను అందజేశారు.









sakshi.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com