Headlines News :
Home » » ఆమె కన్నీరు పెట్టుకుంది

ఆమె కన్నీరు పెట్టుకుంది

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘నాగాభరణం’. రమ్య, దిగంత, సాయికుమార్‌ కీలక పాత్రధారులు. సాజిద్‌ ఖురేషి, ధావల్‌ గడ, సోహైల్‌ అన్సారీ నిర్మాతలు. గురుకిరణ్‌ సంగీతం అందించారు. ఇటీవల ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎన.శంకర్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని సాయికుమార్‌ స్వీకరించారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘సినిమా తియ్యాలంటే సృజనాత్మకత ఉంటే సరిపోదు. మంచి కథ, తపన గల నిర్మాత కావాలి. పాము నేపథ్యంలో కథ చెప్పగానే సాజిద్‌ వెంటనే అంగీకరించారు. నాకిష్టమైన కన్నడ నటుడు విష్ణువర్థనను గ్రాఫిక్స్‌లో క్రియేట్‌ చేసి ఓ కీలక పాత్రలో కనిపించేలా చేశాం. ఆ సన్నివేశాలు చూసి విష్ణువర్ధన భార్య కన్నీరు పెట్టకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రంలో మళ్లీ నటుడిగానే పుడతానని చెప్పారు. దానికి ఈ చిత్రం ట్రైలర్‌ అని చెప్పొచ్చు’’ అని అన్నారు. ‘‘ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు.






andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com