Headlines News :
Home » » బ్రేకప్‌ తరువాత హ్యాపీ బర్తడే చెప్పింది.

బ్రేకప్‌ తరువాత హ్యాపీ బర్తడే చెప్పింది.

బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ బుధవారం తన 34వ పుట్టినరోజు జరుపు కున్నాడు. అతనికి మాజీ గాళ్‌ఫ్రెండ్‌ కట్రీనా కైఫ్‌ వెరీ హ్యాపీ బర్‌‌తడే చెప్పింది. ఎక్కడనుకున్నారు? వాళ్లిద్దరూ కలిసి నటిస్తున్న జగ్గా జాసూస్‌ సినిమా సెట్‌‌సపై. ఆ రోజు షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పాక అక్కడే రణబీర్‌ బర్‌‌తడే పార్టీ జరగగా, దానికి మాత్రం డుమ్మా కొట్టేసింది కట్రీనా. పార్టీలో ఉన్నవాళ్లందరూ ఆమె వస్తుందని ఎదురుచూశారు కానీ ఆమె మాత్రం ఆగకుండా నేరుగా ఇంటికెళ్లిపోయింది. సన్ని హిత వర్గాల సమాచారం ప్రకారం రణబీర్‌ బర్‌‌తడే పార్టీ మొదలైతే, తను ఇరకాటంలో పడుతుందని భావించిన కట్రీనా షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఆగకుండా వెళ్లిపోయింది. వెళ్లే ముందు రణబీర్‌కు శుభాకాంక్షలు చెప్పింది. కొంతకాలం క్రితం తమ అనుబంధానికి బ్రేకప్‌ చెప్పిన ఆ జంట సినిమాల విషయంలో ప్రొఫెషనల్‌‌సగానే వ్యవహరిస్తూ జగ్గా జాసూస్‌ కలిసి చేస్తున్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com